ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనలో ఉంది. ఇక భారత పర్యటనలో భాగంగా ఇప్పటికే టి20 సిరీస్ ఆడింది న్యూజిలాండ్ జట్టు. ఎంపిక ఈ టి 20 సిరీస్ లో భారత జట్టు పూర్తి ఆధిపత్యాన్ని సాధించి న్యూజిలాండ్ జట్టును క్లీన్ స్వీప్ చేసి మూడు మ్యాచ్లలో విజయం సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత్ న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతుంది. ఇక ఈ టెస్టు సిరీస్లో ఎవరు విజయం సాధించగలుగుతారు అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే ఒకానొక దశలో భారత్ న్యూజిలాండ్ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని సాధిస్తుందన్న విధంగానే ఉంది పరిస్థితి.


 కానీ ఆ తర్వాత కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ జట్టు మాత్రం ఎంతో వ్యూహాత్మకంగా ఆటను కొనసాగించడంతో టీమిండియాకు గెలుపు దక్కకుండానే  అయిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే న్యూజిలాండ్తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారీ తేడాతో భారత్ విజయం సాధిస్తుంది అన్నప్పటికీ చివరి మ్యాచ్ డ్రాగా ముగియడం తో అభిమానులను నిరాశ లో మునిగి పోయారు అని చెప్పాలి. టీం ఇండియా బ్యాట్స్మెన్ లు సరిగ్గా లేకపోవడం కారణంగానే ఇలా మ్యాచ్ డ్రాగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చారు.


 అయితే రెండవ టెస్టు మ్యాచ్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులోకి రాబోతున్నాడు. దీంతో ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవలే మొదటి మ్యాచ్ డ్రాగా ముగియడం మాత్రం టీమిండియాకు పెద్ద మైనస్ గా మారిపోయింది అని చెప్పాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలకమైన పాయింట్లను భారత్ చేర్చుకుంది. మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్కు 12 పాయింట్లు ఖాతాలో చేరిపోయేవి. కానీ మ్యాచ్ డ్రాగా ముగియడం తో ఇరు జట్లకు చెరో నాలుగు పాయింట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి చేరుకోవడంతో స్వదేశంలో వెస్టిండీస్ జట్టుపై గెలిచినా  శ్రీలంక మొదటి స్థానం లోకి దూసుకు పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: