ప్రస్తుతం భారత్ న్యూజిలాండ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియడం తో ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ నిర్ణయాత్మకమైన మ్యాచ్ గా మారిపోయింది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లోకి వెళ్ళడానికి భారత్కు ఎంతో కీలకంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ టెస్టు మ్యాచ్లో భాగంగా నిన్న విరాట్ కోహ్లీ వికెట్ అయిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.. విరాట్ కోహ్లీ విషయంలో అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.



 విరాట్ కోహ్లీ వికెట్ విషయంలో ఫీల్డ్ అంపైర్ తో పాటు థర్డ్ ఎంపైర్ తీసుకున్న నిర్ణయం అందరినీ అవాక్కయ్యేలా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇన్నింగ్స్ లో భాగంగా 30 ఓవర్  వేసిన అజాజ్ పటేల్ బౌలింగ్లో డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే బంతి  ప్యాడ్ కి తాకింది. దీంతో బౌలర్ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్  అనిల్ చౌదరి ఔట్ గా ప్రకటించాడు. అయితే ఎలాంటి సందేహం లేకుండా విరాట్ కోహ్లీ వెంటనే రివ్యూ కోరాడు. ఈ క్రమంలోనే రివ్యూలో మొదట బంతి బ్యాట్ కు తగిలి ఆ తర్వాత ప్యాడ్ కి తగినట్లుగా కనిపించింది.


 అయితే ఇక ఈ విజువల్స్ పలు కోణాల్లో పరిశీలించాడు థర్డ్ అంపైర్ గా ఉన్న వీరేందర్ శర్మ. అయితే అందరూ నాట్ ఔట్ గా ఇస్తారు అని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఫీల్డ్ అంపైర్ నిర్ణయం కొనసాగిస్తూ విరాట్ కోహ్లీని ఔట్ గా ప్రకటించాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. అయితే గతంలో ఐపీఎల్ సమయంలో వీరేందర్ శర్మతో పలు విషయాలలో కోహ్లీ గొడవకు దిగాడు. అది గుర్తుంచుకునే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. అంత క్లియర్గా నాటౌట్ అని కనిపిస్తూ ఉంటే అవుట్ గా ఎలా ప్రకటిస్తారు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: