కొద్ది రోజుల క్రితం ముగిసిన టీ 20 వరల్డ్ కప్ లో సమిష్టిగా రాణించిన కివీస్ ఎవరూ ఊహించిన విధంగా ఫైనల్ కు చేరుకుంది. కానీ దురదృష్టవశాత్తూ ప్రపంచ కప్ ఫైనల్ ఫోబియాను న్యూజిలాండ్ అధిగమించలేకపోయింది. ఇప్పటి వరకు అటు వన్ డే మరియు టీ 20 ప్రపంచ కప్ లను గెలిచింది లేదు. అంతే కాకుండా రెండు సార్లు ఫైనల్ చేరినా ప్రపంచ కప్ ను ముద్దాడలేకపోయింది. అయితే అదే ఫామ్ తో ఇండియా టూర్ కు చేరుకుంది కివీస్. మూడు టీ 20 లు మరియు 2 టెస్ట్ ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే టీ 20 ను కోల్పోయింది. ఈ సిరీస్ ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ అపజయాన్ని మరువకముందే టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది.

మొదటి టెస్ట్ లో కొద్దిలో ఓటమిని తప్పించుకుంది. కాగా నిన్నటి నుండి ముంబై లోని వాంఖడే వేదికగా రెండవ టెస్ట్ లో సైతం సరైన ఆటతీరును కనబరచలేకపోయింది. మొదట్లో ఇండియా తడబడినా ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ 150 పరుగులు చేయడంతో కివీస్ కు సవాల్ విసిరింది. ఈ రోజు మొదట ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ ఆటగాళ్లు ఏ దశలోనూ కోలుకోలేదు. వరుస వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరికి ఇండియా బౌలర్లు అంతా సమిష్టిగా రాణించడంతో కివీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. ఒక్కరి దగ్గర కూడా సరైన సమాధానం లేకపోయింది.  

న్యూజిలాండ్ ఆటగాళ్లలో కనీసం ఎవ్వరూ కూడా బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు. న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ గాయంతో టెస్ట్ కు దూరం కావడంతో జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు ఎవ్వరూ కనీసం క్రీజులో నిలబడలేక అష్ట కష్టాలు పడ్డారు. ఒక బలమైన ఇండియా లాంటి జట్టును యువ రక్తం కూడిన జట్టు ఎదుర్కోవాలంటే కష్టమే. కానీ టీం విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. బౌలర్లలో ఒక్క అజాజ్ పటేల్ మినహా ఎవ్వరూ ఆకట్టుకోలేకపోయారు. కేవలం 62 పరుగులకే కుప్పకూలడం అనేది చాలా దారుణమని సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి.  అనుభవలేమి ఒక్కటే ఇంతటి దారుణమైన వైఫల్యానికి కారణమని తెలుస్తోంది.







మరింత సమాచారం తెలుసుకోండి: