భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ క్రమంలో రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో గెలుపుతో  ఒకవైపు సిరీస్ గెలుచుకోవడమే కాదు అటు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో కూడా పాయింట్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ గెలవడానికి టీమిండియా సర్వ ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే భారత బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తుంది అని చెప్పాలి.



 అదే సమయంలో భారత బౌలింగ్ విభాగం అయితే అదరగొడుతుంది అని చెప్పాలి. ఏకంగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ లతో భారత బౌలింగ్ విభాగం ఒక ఆట ఆడుకుంటున్నారూ. తొలి ఇన్నింగ్స్ లో భాగంగా కేవలం 62 పరుగులకే న్యూజిలాండ్ జట్టును ఆల్ ఔట్ చేసి ముప్పుతిప్పలు పెట్టింది టీమిండియా జట్టు. కేవలం 62 పరుగులకే న్యూజిలాండ్ జట్టు ఆలౌట్ కావడంతో ఇక భారీ ఆధిపత్యం లో కొనసాగుతుంది టీమిండియా. అయితే భారత బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ ఎంతో కీలకపాత్ర భావిస్తున్నాడు. ఇప్పట రికార్డులు కొల్లగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ ఇక ఇటీవల మరో రికార్డు సాధించాడు.



 రెండవ ఇన్నింగ్స్ లో భాగంగా మూడు వికెట్లు పడగొట్టాడు రవిచంద్రన్ అశ్విన్. తద్వారా టెస్టుల్లో క్యాలెండర్ ఇయర్లో 50 కంటే ఎక్కువ వికెట్లు నాలుగుసార్లు సాధించిన  భారత బౌలర్ గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.2015, 2016, 2017 2021 సంవత్సరాలలో ఈ ఘనత సాధించాడు రవిచంద్రన్ అశ్విన్.. అంతకు ముందు అనిల్ కుంబ్లే మూడు సార్లు, హర్భజన్ సింగ్ మూడు సార్లు, కపిల్దేవ్ రెండుసార్లు ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వరకు ఎవరు కూడా భారత క్రికెట్ లో నాలుగు సార్లు ఇలా 50 కంటే ఎక్కువ వికెట్లు సాధించలేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: