క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోయి చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూ ఉంటుంది. ఇక క్రికెట్ మ్యాచ్ లో కొన్నిసార్లు ప్రేక్షకులు అందరూ కూడా ఆశ్చర్య పోయే సన్నివేశాలు కూడా చోటుచేసుకుంటాయి. బ్యాట్ మెన్ లు అదిరిపోయే సిక్సర్లు కొట్టడం.. అందరూ ఎవరూ ఊహించని విధంగా వికెట్లు పడగొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. మరికొన్నిసార్లు ఫీల్డర్లుమైదానంలో పాదరసంలా కదులుతూ అనూహ్యమైన ఫీల్డింగ్ చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. ఇలా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎన్నో రకాల సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.



 అందుకే క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా మ్యాచ్ వస్తోందంటే చాలు కన్నార్పకుండా చూస్తూ ఉంటారు. అయితే ఇలా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగే కొన్ని కొన్ని ఫన్నీ సన్నివేశాలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.. ఇక ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు ప్రేక్షకులు అందరూ కడుపుబ్బా నవ్వుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా సిక్సర్ వెళ్తుంది అనుకున్న బంతిని బౌండరీ దగ్గర ఉన్న ఫీల్డర్ ఎంతో సాహసోపేతంగా క్యాచ్ పట్టడం లాంటివి చూస్తూ ఉంటాం.


 ఇక్కడ ఒక ఆటగాడు అలాగే బౌండరీ లైన్  దగ్గర క్యాచ్ పట్టాడు. కానీ ఇలా క్యాచ్ పట్టడానికి అతడు పెద్దగా కష్టపడలేదు. ప్రస్తుతం యూరోపియన్ క్రికెట్లో ఈ ఘటన జరిగింది.ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్పిన్నర్ బౌలింగ్లో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ భారీ షాట్ కొట్టాడు. ఈ క్రమంలోనే అది సిక్సర్ అని అందరూ భావించారు. అక్కడే అసలు ట్విస్టు చోటుచేసుకుంది. 30 గజాల దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బౌండరీ లైన్ దగ్గర ఒంటి చేత్తో  క్యాచ్ పట్టాడు ఫీల్డర్. ఆ తర్వాత తనదైన శైలిలో డాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత సింపుల్గా కూడా క్యాచ్ పట్ట వచ్చా అంటూ షాక్ అవుతున్నారు అందరు.

మరింత సమాచారం తెలుసుకోండి: