భారత క్రికెట్లో స్టార్ ఆల్రౌండర్గా కొనసాగాడు హార్దిక్ పాండ్య ప్రతిసారీ కీలక సమయంలో వికెట్లు పడగొట్టడమే కాదు ఏకంగా భారీగా పరుగులు కూడా చేస్తూ అసలుసిసలైన ఆల్రౌండర్ అంటే ఇలాగే ఉండాలి అంటూ నిరూపించాడు. ఇక మైదానంలో హార్దిక్ పాండ్యా చేసే ఫీల్డింగ్  గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగిన హార్దిక్ పాండ్యా గత కొంతకాలం నుంచి ఫామ్ను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా బౌలింగ్ కి దూరమైనప్పటికీ అతనికి బీసీసీఐ టి20 వరల్డ్ కప్ లో అవకాశం కల్పించింది.



 కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు హార్దిక్ పాండ్యా. అటు బౌలింగ్ కు దూరంగా ఉండడమే కాదు బాటిల్లో కూడా పెద్దగా ఏమీ రాణించలేదు. దీంతో చివరికి బీసీసీఐ హార్దిక్ పాండ్యా కు ఉద్వాసన పలికింది అనే విషయం తెలిసిందే. ఫిట్నెస్ నిరూపించుకోవాలి అంటూ హార్దిక్ పాండ్యా కు సూచించింది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు హార్దిక్ పాండ్యా. అయితే మరికొన్ని రోజుల్లో హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. రానున్న రోజుల్లో హార్దిక్ పాండ్యా టెస్ట్ ఫార్మాట్ కి గుడ్ బై చెప్పబోతున్నాడట.


 ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే టెస్టు ఫార్మాట్ కు  గుడ్ బై చెప్పడం ద్వారా అతను పరిమిత ఓవర్ల క్రికెట్ పై పూర్తిస్థాయి దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా హార్దిక్ పాండ్యా గత కొంత కాలం నుంచి టెస్టు ఫార్మాట్కు దూరంగానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే.  టెస్ట్ క్రికెట్ ఆడి దాదాపు మూడు సంవత్సరాలు అయింది. ఇక ప్రస్తుతం 28 ఏళ్ల ఈ ఆటగాడు టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పి టి 20, వన్డే ఫార్మాట్ క్రికెట్ పైన ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 2018లో ఇంగ్లాండ్ తో తన చివరి టెస్ట్ ఆడాడు హార్దిక్ పాండ్యా.

మరింత సమాచారం తెలుసుకోండి: