రుతు రాజ్ గైక్వాడ్ ఈ పేరు తెలియని భారత క్రికెట్ ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇతనికి అంతర్జాతీయ క్రికెట్ లో ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ అటు ప్రేక్షకులందరినీ అలరించే ఐపీఎల్లో మాత్రం ఎన్నో రికార్డులు ఉన్నాయి అని చెప్పాలి. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఎన్నికైనా రుత్ రాజ్ మొదట్లో పేలవా ప్రదర్శనతో నిరాశపరిచాడు. కానీ ఆ తర్వాత మాత్రం రుతురాజ్ గైక్వాడ్ పుంజుకున్న తీరు ఏకంగా సీనియర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. ఎంతో అలవోకగా పరుగులు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఈ యువ ఆటగాడు.


 అంతర్జాతీయ క్రికెట్లో ఎలాంటి అనుభవం లేక పోయినప్పటికీ అటు ఐపీఎల్లో అంతర్జాతీయ స్థాయి బౌలర్లను సైతం ఎదుర్కొంటూ భారీ పరుగులు చేయడంతో రుతురాజ్ కీలక పాత్ర వహించాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస విజయాలు సాధించి టైటిల్ గెలుచుకోవడంలో రుతురాజ్ గైక్వాడ్ పాత్ర ఎంతో కీలకమైనది అని చెప్పాలి. ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోయాడు.  చెన్నై సూపర్ కింగ్స్ లో  ఈ యువ ఆటగాడు ఎంతగా ప్రభావితం చేశారంటే జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్ళను సైతం మెగా వేలంలోకి వదిలేసి యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ రిటైన్ చేసుకునే విధంగా ప్రభావితం చేశాడు.



 కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు  క్రికెట్ ఆడిన ప్రతి చోట అదరగొడుతు సంచలన రికార్డు నమోదు చేస్తున్నాడు.చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో   కీలక పాత్ర పోషించిన ఓపెనర్ రుతురాజ్ ప్రస్తుతం విజయ్ హజారే టోర్నీలో కూడా అదే జోరు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ హజారే టోర్నీలో మహారాష్ట్ర కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక విజయ్ హజారే ట్రోఫీ లో ఏకంగా వరుసగా మూడు సెంచరీలు నమోదు చేసీ అరుదైన రికార్డును సాధించాడు. మధ్యప్రదేశ్ లో జరిగిన మ్యాచ్లో 136, చత్తీస్గడ్ పై జరిగిన మ్యాచ్లో 154, కేరళ పై జరిగిన మ్యాచ్ లో 124 పరుగులు చేసి హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశారు యువ ఆటగాడు. రుతురాజ్ పై నమ్మకం ఉంచి రిటైన్ చేసుకున్న ధోని అతను అద్భుతంగా రాణిస్తూ ఉండడంతో ఎంతో పడిపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: