
అయితే ప్రతీ విషయంలోనూ ఇంగ్లాండ్ జట్టును బ్యాడ్లక్ వెంటాడుతుంది అనే చెప్పాలి. టాస్ టీమ్ సెలక్షన్ బ్యాట్స్మెన్ అవుట్ అయిన తీరు పూర్తిగా ఇంగ్లాండ్ జట్టును బాడ్ లక్ వెంటాడుతూనే ఉంది అని చెప్పాలి. ఇంగ్లాండు ఆటగాళ్ల ఫీల్డింగ్ కూడా తీవ్రంగా నిరాశ పరుస్తుంది అనే చెప్పాలి.. అయితే ఇటీవలే రెండో ఇన్నింగ్స్ సమయంలో వికెట్-కీపర్ జోస్ బట్లర్ నిలకడగా రాణించిన తీరు అందరిలో ఎంతో ఆశలు రేకెత్తించింది అనే చెప్పాలి. అద్భుతంగా డిఫెన్స్ చేస్తూ కేవలం అవసరమైనప్పుడు మాత్రమే సింగిల్ చేస్తూ వచ్చాడు. 207 బంతులు ఆడాడు జోస్ బట్లర్. ఇక అతని సహనానికి అందరూ ఆశ్చర్యపోయారు అనే చెప్పాలి.
ఇలా ఎంతో ఓపికగా ఆడుతున్న జోస్ బట్లర్ విషయంలో దురదృష్టం మాత్రం తలుపు తట్టింది. దీంతో వికెట్ కాపాడుకుంటూ వచ్చిన జోస్ బట్లర్ ఊహించనివిధంగా వికెట్ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 110 వ ఓవర్లో బట్లర్ కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అనుకోకుండా అతని పాదం వికెట్లకు తాకడంతో బెయిల్ కిందపడింది. అయినప్పటికీ గమనించని బట్లర్ సింగిల్ కోసం గ్రీసులోనుండి బయటికి వచ్చి నిలబడ్డాడు. కానీ బెయిల్స్ కింద పడి పోవడాని గమనించిన ఫీల్డర్లు అప్పీల్ చేశారు. దీంతో ఇది గమనించిన బట్లర్ తనని తాను నిందించుకుంటూ ఎంతో నిరాశగా పెవీలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇలా ఎంతో ఓపికగా ఆడిన ఆటగాడు బట్లర్ వికెట్ కోల్పోయిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.