ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమ్ ఇండియా సౌత్ఆఫ్రికా పర్యటన కాస్త ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ఈసారి టీమిండియా ఎంతో బలంగా కనిపిస్తూ ఉండటంతో ఈసారి తప్పక టెస్ట్ సిరీస్ విజయం సాధించి కోహ్లీ సేన సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది అని ప్రస్తుతం అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతోంది టీమిండియా జట్టు. అయితే ఇటీవలే సొంత గడ్డపై టీమిండియా అదరగొట్టి వరుస విజయాలను అందుకుంది. ఇక సౌత్ ఆఫ్రికా లో ఉన్న బౌన్సీ పిచ్లపై టీమిండియా ఎలా రాణించ పోతుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే నేడే టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.
కాగా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా ఆడిన గణాంకాలు చూసుకుంటే.. దక్షిణాఫ్రికాతో ఇప్పటి వరకు 7 టెస్టు సిరీస్ లు ఆడింది టీమిండియా. ఇక ఇందులో ఆరు టెస్టు సిరీస్ లలో టీమిండియా ఓటమి చవిచూసింది. ఒక టెస్టు సిరీస్ మాత్రమే డ్రాగా ముగించింది టీమిండియా. సౌత్ ఆఫ్రికా గడ్డపై ఇప్పటివరకు భారత్ మొత్తంగా 20 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది.. కేవలం మూడు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించడం గమనార్హం.. ఇక 10 మ్యాచ్ లలో ఓటమి చవిచూసింది. మిగిలిన ఏడు మ్యాచ్ లు కూడా డ్రాగా ముగిశాయి.. ఇలా ఇప్పటివరకు టీమ్ ఇండియా సౌత్ఆఫ్రికా గడ్డపై మంచి ప్రదర్శన చేసిన దాఖలాలు లేవు. దీంతో ఇప్పుడు సిరీస్ గెలిస్తే కోహ్లీసేన సరికొత్త చరిత్ర సృష్టించినట్లు అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి