ఇక ఇప్పుడు భారత ప్రేక్షకులకు ఇలాంటి నిరాశ మళ్లీ ఎదురైంది. మరోసారి పాకిస్థాన్ జట్టు చేతిలో భారత జట్టు ఓటమి చవిచూసింది. ప్రస్తుతం అండర్-19 ఆసియా కప్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్కు పాకిస్థాన్ చేతిలో ఓటమి ఎదురైంది. చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో టీమిండియా పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది పాకిస్థాన్ జట్టు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49 ఓవర్లలో 237 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇక ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించడంతో ఒకానొక సమయంలో పాకిస్థాన్ జట్టు పరుగులు తీయడానికి ఎంతగానో కష్టపడింది.
ఇది 8 వికెట్ల నష్టానికి 50 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు లక్ష్యాన్ని చేధించింది. చివరగా ఐదు బంతుల్లో 8 పరుగుల సమీకరణం ఉన్న సమయంలో వరుసగా రెండు సింగిల్స్ వచ్చాయి.. దీంతో మూడు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో 4, 5 బంధువులకు పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అహ్మద్ ఖాన్ 2 డబుల్స్ తీశాడు.దీంతో ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండటంతో మరింత ఉత్కంఠభరితంగా మ్యాచ్ మారిపోయింది. ఇక చివరి బంతిని అహ్మద్ ఖాన్ బౌండరీకి తరలించడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు.ఇక పాకిస్థాన్ చేతిలో మరో సారి భారత జట్టు ఓడిపోవడంతో భారత క్రికెట్ ప్రేక్షకులు నిరాశలో మునిగిపోయారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి