ప్రపంచ క్రికెట్లో ఏ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పటికీ సాధారణంగా అని భావించే క్రికెట్ ప్రేక్షకులు..  భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే భారతదేశం నిషేధం విధించడంతో కేవలం ఐసిసి టోర్నీలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులు గా ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోటీ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులను ఆకర్షిస్తూ అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే.



 ఇక టి20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఎక్కువమంది క్రికెట్ ప్రేక్షకులు చూసిన మ్యాచ్ గా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రికార్డు సృష్టించింది. అయితే టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ జట్టు మొదటిసారి టీమిండియా పై విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అటు ప్రేక్షకుల్లో ఉత్కంఠ మాత్రమే కాదు అటు మైదానంలో ఆడుతున్న ఆటగాళ్ళ మధ్య కూడా ఎంతగానో ఒత్తిడి ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టులో కీలక బౌలర్గా కొనసాగిన షాహీన్ అఫ్రిది టీమిండియాతో మ్యాచ్ కి ముందు ఎంతో ఒత్తిడికి గురయ్యాడు అంటూ చెప్పుకొచ్చారు మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది.


 ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో షాహీన్ అఫ్రిది తొలి గేమ్ ఆడక ముందు నాతో వీడియో కాల్ మాట్లాడాడు. ఎంతో ఒత్తిడికి గురవుతున్నాను అంటూ తెలిపాడు. దాదాపు 12 నిమిషాల పాటు వీడియో కాల్ లో మాట్లాడుకున్నాం. అయితే దేవుడు నీకు ఇచ్చిన మంచి అవకాశాన్ని వినియోగించుకుని.. అత్యుత్తమ ప్రదర్శన చెయ్యి.. టీమిండియా వికెట్లు తీసి హీరో అవ్వు అంటూ అతడికి సూచించాను అంటూ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది చెప్పుకొచ్చాడు.  తాను క్రికెట్ లో కొనసాగిన సమయంలో టీమిండియాతో మ్యాచ్ కి ముందు ఎలాంటి ఒత్తిడికి గురయ్యే వాడిని అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. టీమిండియాతో  మ్యాచ్ ఉంది అంటే ముందు రోజు రాత్రి నిద్ర పట్టేది కాదు అంటూ చెప్పుకొచ్చాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: