ప్రపంచ క్రికెట్లో వికెట్ కీపర్గా మహేంద్ర సింగ్ ధోనీకి ఎంతగానో గుర్తింపు ఉంది . వికెట్ల వెనకాల నిలబడి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయా గల సత్తా ధోని సొంతం అని చెబుతూ ఉంటారు మాజీ ఆటగాళ్లు. అంతే కాదు ధోని వికెట్ల వెనకాల కీపింగ్ చేస్తున్న సమయంలో బ్యాటింగ్ చేస్తున్న ఆటగాళ్లు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా వికెట్ చేజార్చుకోవాల్సిన  పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అద్భుతమైన క్యాచ్ లు పట్టడమే కాదు.. రెప్పపాటు కాలంలో స్టంప్ అవుట్ చేయడంలో మహేంద్ర సింగ్ ధోనీ దిట్ట అని చెప్పాలి.


 అందుకే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కాపీ కొట్టడానికి ఎంత మంది విదేశీ ఆటగాళ్లు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇకపోతే మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా భారత క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు రిషబ్ పంత్. మొదట్లో బ్యాటింగ్ లో  పర్వాలేదు అనిపించినప్పటికీ కీపింగ్ లో మాత్రం అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ క్రమంలోనే ధోని వారసుడు అంటూవచ్చిన రిషబ్ పంత్ ఆటతీరుపై అందరూ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం కీపింగ్ లో కూడా ఎంతగానో నైపుణ్యం సాధించాడు పంత్.


 ఇక ఇటీవలే మహేంద్ర సింగ్ ధోనీని వెనక్కినెట్టి అరుదైన రికార్డును సాధించాడు.  తక్కువ టెస్టు మ్యాచుల్లో నే వందమందిని అవుట్ చేసిన భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.. ఇప్పటివరకు ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ, వృద్ధిమాన్ సాహా పేరిట ఉండేది. ఇప్పుడు రిషబ్ పంత్ ఈ రికార్డును బ్రేక్ చేసేసాడు అని చెప్పాలి. మహేంద్రసింగ్ ధోని, వృద్ధిమాన్ సాహా 36 టెస్టుల్లో ఈ ఘనత సాధిస్తే.. రిషబ్ పంత్ మాత్రం కేవలం 26 టెస్టు మ్యాచుల్లో నే వందమందిని అవుట్ చేసిన కీపర్గా రికార్డు సృష్టించాడు. కేవలం 21 టెస్ట్ ల్లోనే 100 మందిని అవుట్ చేసిన కీపర్గా సౌత్ ఆఫ్రికా క్వింటన్ డికాక్ ఈ లిస్టులో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: