ఇక ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్లో భాగంగా ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టుకు దురదృష్టం వెంటాడుతోంది. ప్రపంచ క్రికెట్లో ఛాంపియన్గా కొనసాగుతున్న ఇంగ్లాండ్ జట్టు యాషెస్ సిరీస్లో మాత్రం కనీస ప్రదర్శన చేయలేకపోయింది. వరుసగా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగం అయితే ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలి పోయింది అని చెప్పాలి. ఇలా యాషెస్ సిరీస్లో ఓటములతో సతమతమవుతోంది ఇంగ్లాండ్ జట్టు. ఇలా పేలవ ప్రదర్శనతో ఫామ్ కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ఇబ్బంది పడుతున్న సమయంలో అటు కరోనా వైరస్ కూడా వరుసగా షాక్ ఇస్తూ వచ్చింది.
ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ ఆటగాళ్లకు చెందిన కుటుంబ సభ్యులు మొదట వైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత ఇక జట్టులోని కొంతమంది సిబ్బంది కూడా వైరస్ బారిన పడ్డారు. చివరికి క్వారంటైన్ కే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు క్యాంపులో మరో వైరస్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సపోర్టింగ్ స్టాఫ్ ఆటగాళ్ల కుటుంబసభ్యుల్లో ఆరుగురికి వైరస్ సోకగా.. హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ కుటుంబంలో ఒకరికి కరోనా వైరస్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇక హెడ్ కోచ్ సిల్వర్ వుడ్ ను కూడా ప్రస్తుతం ఐసోలేషన్ లోకి పంపించినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఇప్పటికే పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న ఇంగ్లండ్ జట్టు నాల్గవ టెస్ట్ మ్యాచ్ కోచ్ లేకుండానే ఆడ బోతుంది. దీంతోఏం జరుగుతుందో అర్థం కాక ఇంగ్లాండ్ ఆటగాళ్లు తలలు పట్టుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి