టీమ్ ఇండియా సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉంది. సౌత్ ఆఫ్రిక పర్యటనలో భాగంగా ఇద్దరు కెప్టెన్ ల సారథ్యంలో టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా టెస్ట్ వన్డే సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే కోహ్లీ సారథ్యంలో టీం ఇండియా టెస్ట్ సిరీస్ ఆడుతుంది. అయితే సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా రోహిత్ ఇండియా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ గా నియమిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కాస్త సంచలనంగా మారిపోయింది  రోహిత్ శర్మ సొంతగడ్డపై శుభారంభం చేశాడు. మరి విదేశాలలో ఎలా రాణిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. సౌత్ ఆఫ్రికా పర్యటనలో రోహిత్ శర్మ తన కెప్టెన్సీతో ఎలాంటి ప్రభావం చూపించపోతున్నాడు అన్నది ఆసక్తిగా మారింది.


 ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా పర్యటనకు ముందే రోహిత్ శర్మ గాయం బారిన పడ్డాడు. అయితే ప్రస్తుతం బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికాలో జరిగే టెస్ట్ సిరీస్ కి గాయం కారణంగా దూరం అయ్యాడు అనే విషయం తెలిసిందే. అయితేటెస్ట్ సిరీస్కు దూరమైన రోహిత్ వన్డే సిరీస్ కి మాత్రం  అందుబాటులోకి వస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వన్డే సిరీస్కు కూడా రోహిత్ శర్మ దూరమయ్యారు.



 ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా పర్యటన లో టీమిండియా వన్డే సిరీస్ కోసం కొత్త కెప్టెన్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.  ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న కె.ఎల్.రాహుల్ ను  కెప్టెన్గా బిసిసిఐ ఎంపిక చేసింది. ఈ సమయంలో ప్రస్తుతం టీమిండియా జట్టులో కీలక బౌలర్ గా కొనసాగుతున్న జస్ప్రిత్ బూమ్రాకు  వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పజెప్పింది బీసీసీఐ. ప్రస్తుతం ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. జస్ప్రిత్ బూమ్రా ని వైస్ కెప్టెన్ గా నియమించడంపై అటు ఆకాష్ చొప్రా హర్షం వ్యక్తం చేసాడు. అతన్ని వైస్ కెప్టెన్ గా నియమించడం ఒక అద్భుతమైన నిర్ణయం అంటూ చెప్పుకొచ్చాడు. జస్ప్రిత్ బూమ్రా కెరీర్లో ఇది తొలిమెట్టు అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: