ఎంతో ఉత్కంఠ భరితంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో బౌలింగ్ చేసే ప్రతి బౌలర్  కూడా వికెట్ పడగొట్టాలి అనే లక్ష్యంతోనే బంతులను సందిస్తూ ఉంటారు. ఇక ఒక అనుకున్నట్లుగానే వ్యూహాలు ఫలించి వికెట్ పడింది అంటే చాలు ఆనందంలో మునిగి పోతూంటారు బౌలర్లు. ఈ క్రమంలోనే ఎంతో మంది బౌలర్లు మైదానంలో వికెట్ పడగొట్టిన తర్వాత చిత్రవిచిత్రంగా సెలబ్రేషన్స్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా వికెట్ పడగొట్టిన తర్వాత బౌలర్లు చేసే సెలబ్రేషన్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అందరినీ ఆకర్షిస్తోంది.



 పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీష్ రౌఫ్ బిగ్ బాస్ లీగ్ లో భాగంగా మెల్బోర్న్ స్టార్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇక ఇటీవలే పెర్త్ స్కాచర్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో భాగంగా పెర్త్ స్కాచర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలోనే మెరుపు బ్యాటింగ్తో అదరగొట్టింది. రెండు ఓవర్లలోనే 21 పరుగులు చేసి దూకుడుగా ఆడటంతో ప్రారంభించారు బ్యాట్స్మెన్లు. అదే సమయంలో మూడవ ఓవర్ వేసేందుకు పాకిస్తాన్ బౌలర్ హరీష్ రౌఫ్ అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పీటర్సన్ హరీష్ రౌఫ్ బౌలింగ్లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.



 ఈ సందర్భంగా వికెట్ పడగొట్టిన ఆనందంలో హరీష్ రౌఫ్ చేసుకున్న సెలబ్రేషన్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయాయ్ అని చెప్పాలి. అందరికంటే భిన్నంగా కాస్త విచిత్రంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కరోనా వైరస్ నివారణ కు అందరూ తీసుకోవలసిన జాగ్రత్తలను తన సెలబ్రేషన్స్ లో తెలియజేశాడు. శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని.. అంతేకాకుండా మాస్కు ధరించటం లాంటివి చేయాలి అంటూ వికెట్ తీసిన తర్వాత సెలబ్రేషన్స్ చేశాడు హరీష్ రౌఫ్. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో బిగ్ బాస్ లీగ్ మేనేజ్మెంట్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: