ఇక మరికొంతమంది రికార్డుల రారాజు అని పిలుచుకుంటారు. ఇక ఇవన్నీ పేర్లు ఊరికే రాలేదు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది దిగ్గజ క్రికెటర్ లు సాధించిన రికార్డును తక్కువ సమయంలోనే సాధించి విరాట్ కోహ్లీ తన పేరిట లిఖించుకున్నాడు. ఒకవైపు జట్టుకు కెప్టెన్గా అద్భుతంగా జట్టును ముందుకు నడిపిస్తున్న మరోవైపు కీలక ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ రాణిస్తూ వస్తున్నాడు. కేవలం బ్యాటింగ్ లో మాత్రమే కాదు అటు ఫీల్డింగ్ లో కూడా విరాట్ కోహ్లీ తనకు తానే సాటి అంటూ ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు. మైదానంలో పాదరసంలా కదులుతూ మెరుపు ఫీల్డింగ్ చేస్తూ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ.
ఇలా మైదానంలో మెరుపు ఫీల్డింగ్ తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ సౌతాఫ్రికా మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్లో భాగంగా 100 టెస్ట్ క్యాచ్ లు అందుకుని సరికొత్త మైలురాయిని అధిగమించాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు భారత క్రికెట్ లో టెస్టుల్లో అజారుద్దీన్ సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ మాత్రమే 100 క్యాచ్ లు అందుకున్న ఆటగాళ్లు గా ఉన్నారు. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.