130 కోట్ల మంది భారతీయుల చూపంతా ఈ రోజు కేప్ టౌన్ వేదికగా జరగబోయే మూడవ వన్ డే మీదనే ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే భారత్ ఎక్కడ ఆడినా గెలవాలని అంతా కోరుకుంటారు. కానీ సఫారీల చేతిలో వరుస ఓటములతో గతి తప్పిన ఇండియాకు ఈ రోజు మద్దతుగా నిలిచి గెలిచేందుకు అవసరమైన ధైర్యాన్ని మనోబలాన్ని ఇవ్వనున్నారు. ఈ సంవత్సరంలోనే టీ 20 వరల్డ్ కప్ మరియు తర్వాత సంవత్సరంలో వన్ డే వరల్డ్ కప్ ఉండగా టీమ్ ఇలా సమిష్టిగా విఫలం కావడం ఎంతో దురదృష్టకరం. అదీ కాకా అంతగా అనుభవం లేని సౌత్ ఆఫ్రికా టీమ్ తో ఇలా ఓడిపోవడం మరింత బాధకు గురి చేసింది. ఈ రోజు గెలుపే లక్ష్యంగా 11 మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. అయితే ఈ రోజు రాహుల్ సేన గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉంది అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక భారత అభిమానిగా ఎలా ఆడితే ఇండియా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒకసారి విశ్లేషిద్దాం.

* టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకోవడం చాలా అవసరం. అలా కాకుండా ముందు వన్ డే లాగా చేస్తే మ్యాచ్ గోవిందా!

* బౌలర్లు ఆరంభంలో వికెట్లు తీయాలి. మొదటి పవర్ ప్లే లో కనీసం రెండు వికెట్లు తీయగలిగితే ప్రత్యర్థిని ఈజీగా ఒత్తిడిలోకి నెట్టేయచ్చు.

* ఫీల్డింగ్ లో లోపాలను సరిచేసుకోవాలి. మీరు వదిలేసే ప్రతి ఒక్క క్యాచ్ చాలా నష్టాన్ని కలిగిస్తుంది. రెండవ వన్ డే లో రిషబ్ పంత్ వదిలేసిన స్టంపింగ్ వల్ల డికాక్ మ్యాచ్ ను లాగేసుకున్నాడు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదు.

* బ్యాట్స్మన్ ని బట్టి బౌలింగ్ మరియు ఫీల్డింగ్ ని మారుస్తూ ఉండాలి. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ ను బాగా వాడుకోవాలి.

* ప్రత్యర్థి జట్టును 250 పరుగుల లోపు కట్టడి చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయి.

* విరాట్ కోహ్లీ సలహాలను రాహుల్ తప్పక తీసుకోవాలి, అలాగే కోహ్లీ ఇంకా కొంచెం ఇన్వల్వెమెంట్ పెంచుకోవాలి.  

* ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే, ధావన్ మరియు రాహుల్ లు మొదటి పవర్ ప్లే లో వికెట్ పడకుండా కనీసం బంతికి  ఒక పరుగు చొప్పున తీయాలి. అప్పుడే ఒత్తిడి ఉండదు. నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మన్ స్వేచ్ఛగా ఆడగలడు.

* ఒకవేళ ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ ను తీసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ లో ఇంకొంచెం ముందుగా పంపడానికి చూడండి. మాములుగా శ్రేయాస్ అయ్యర్ పంత్ వచ్చే స్థానంలో బాగా ఆడగలడు. పంత్ ఎక్కడైనా ఆడే సామర్ధ్యం ఉంది కాబట్టి ఈ ప్రయోగం చేస్తే బాగుంటుంది.

* సౌత్ ఆఫ్రికా బౌలర్లలో శంసి, మార్ క్రామ్ మరియు మహారాజ్ లు ఎంత ప్రమాదమో గత వన్ డే లో చూశాము. కాబట్టి వీరి బౌలింగ్ లో భారీ షాట్ లకు పోకుండా గ్యాప్ లలో ఆడేందుకు ప్రయత్నించాలి.

గేమ్ ప్లాన్ ప్రకారం రాహుల్ టీమ్ ను నడిపించగలిగితే ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: