రోహిత్ శర్మ లేకుంటే టీమిండియా బాగా రాణించడం కష్టమేనా. వరుస విజయాలతో టీమిండియా సత్తా చాట లేదా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే మాత్రం  అవును అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలికాలంలో టీమిండియా రోహిత్ శర్మ లేకుండా రాణించిన సందర్భాలు ఒక్కటి కూడా లేదు. రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా వన్డేల్లో అయితే ఓపెనర్గా బరిలోకి దిగుతు అద్భుతంగా రాణిస్తూ మంచి శుభారంభాన్ని చేస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. అటు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ లకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఓపెనర్ గా భారీ స్కోర్లు చేసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు.


 ఇలా ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన తో ఒంటిచేత్తో విజయాలు అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక మొన్నటివరకు స్టార్ ఓపెనర్ గా కొనసాగిన రోహిత్ శర్మ ఇటీవల కెప్టెన్గా ప్రమోషన్ కూడా అందుకున్నాడు. ఇప్పటికే ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరుతెచ్చుకున్న రోహిత్ శర్మ ఇక ఇప్పుడు అంతర్జాతీయ టీమిండియా జట్టును తనదైన వ్యూహాలతో ముందుకు నడిపించేందుకు సిద్ధమయ్యాడు.  రోహిత్ శర్మ కెప్టెన్సీలో స్వదేశంలో ఆడిన టి20 సిరీస్లో విజయం సాధించింది టీమిండియా. ఇక ఆ తర్వాత ఇండియా సౌత్ఆఫ్రికా పర్యటనకు ఇక రోహిత్ శర్మ విదేశీ పర్యటనలో ఎలా  జట్టుకు విజయాన్ని అందిస్తాడో అని అందరూ ఎదురు చూశారు.


 కానీ అనుకోని విధంగా రోహిత్ శర్మ గాయం బారిన పడటంతో చివరికి సౌత్ ఆఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. తర్వాత వన్డే సిరీస్కు కెప్టెన్గా ఎంపికయ్యాడు కేఎల్ రాహుల్. ఎలాంటి అనుభవం లేకపోవడంతో కె.ఎల్.రాహుల్ తలపడ్డాడు. చివరికి వన్డే సిరీస్లో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది. అయితే సౌతాఫ్రికా పర్యటనలో మాత్రమేకాదు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాల్లో కూడా రోహిత్ శర్మ లేకుండా భారత జట్టు సరిగ్గా రాణించలేకపోయింది.. ఇప్పటివరకు రోహిత్ లేకుండా పది వన్డేలు ఆడిన టీమిండియా ఒకే ఒక్క వన్డే మ్యాచ్లో గెలిచి 9 ఇంట్లో ఓడిపోవడం గమనార్హం. రోహిత్ శర్మ లేకపోతే టీమిండియా బాగా రాణించడం కష్టమే అన్నది అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: