మొన్నటి వరకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ కేవలం రెండు నెలల కాలంలోనే మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టి20 వరల్డ్ కప్ కి ముందు ఈ ప్రకటన చేసిన విరాట్ కోహ్లీ చెప్పిన విధంగా ఇక వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.  టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా బీసీసీఐ తప్పిస్తుంది అంటూ ఎన్నో రోజుల టాక్ వినిపించింది.



 ఇక మొదటి నుంచి వినిపించినట్లు  గానే బిసిసిఐ విరాట్ కోహ్లీ ని వన్డే కెప్టెన్సీ  నుంచి తపిస్తూ నిర్ణయం తీసుకుంది. వన్డే కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ కు అప్పగించింది బిసీసీఐ. అదే సమయంలో కేవలం టెస్టు కెప్టెన్గా మాత్రమే కొనసాగిన విరాట్ కోహ్లీ ఇటీవలే సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు టెస్టు సిరీస్ ఓడిపోవడంతో టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పేస్తున్నా అంటూ ప్రకటించాడు విరాట్ కోహ్లీ. ఇక అటు టెస్టు కెప్టెన్గా కూడా రోహిత్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ల కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాజీ కోచ్ రవిశాస్త్రి.


 విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఫీల్డ్ లో ఎంతో దూకుడు గా ఉంటాడు. అంతేకాదు యుద్ధవీరుడీలా పోరాడుతూ కనిపిస్తాడు.. ఒక్కసారిగా మైదానంలోకి దిగితే సర్వశక్తులు ఒడ్డి విజయం సాధించాలని అనుకుంటాడు. మైదానంలో ఎంతో దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ ఆట నుంచి బయటికి వచ్చిన తర్వాత మాత్రం ఎంతో కూల్ గా ఆటగాళ్లతో కలిసి పోతూ ఉంటాడు. అయితే కెప్టెన్గా ఎంత ఎనర్జీతో ఉన్నాడో ఇక ఇప్పుడు ఒక ప్లేయర్గా కూడా కోహ్లీ అంతే ఎనర్జీతో ఆడాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు రవి శాస్త్రి. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ విషయానికి వస్తే.. మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటూ తనదైన వ్యూహాలతో మ్యాచ్ను తన ఆధీనంలోకి ఎంతో సులువుగా తెప్పించుకో గల సమర్ధుడు. దేవుడు నాకు ఈ బహుమతి ఇచ్చాడు కష్టపడి పనిచేయనివ్వండి అని రోహిత్ భావిస్తుంటాడు. మంచి ఊపులో ఉన్న ప్పుడు అతడిలా బ్యాటింగ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు అనే చెప్పాలి అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: