టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా పేరున్న ఇద్దరూ పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు ఇది దాదాపు దూరమైపోయారు. కేవలం టెస్ట్ జట్టులో మాత్రమే అవకాశం దర్శించుకుంటున్నారు. అయితే ఎన్నిసార్లు పేలవా ప్రదర్శన చేసిన వీరికి బిసిసిఐ అవకాశం ఇస్తూనే వస్తుంది. ఇక ఎన్ని అవకాశాలు వచ్చినా తమని తాము నిరూపించుకోవడం లో ఇద్దరూ విఫలం అవుతూనే ఉన్నారు.. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా సత్తా చాటుతారూ అనుకుంటే పేలవ బ్యాటింగ్తో నిరాశపరిచారు. దీంతో వారిద్దరినీ టీమిండియా నుంచి పక్కన పెట్టాలి అంటూ డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి.
ఇక తాజాగా ఇదే ఈ విషయంపై బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న టీమిండియా ఆటగాళ్లు అజింక్యా రహానే, పూజారాలు రంజీ క్రికెట్ ఆడితే బెటర్ అంటూ సూచించాడు. ఇలా చేయడం వల్ల మునుపటి ఫామ్ అందుకోవడానికి అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.. ఇన్నేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఇప్పుడు రంజీ మ్యాచ్ లు ఆడటం ఏంటి అని అనుకోవద్దు. 2005 లో ఫామ్ కోల్పోయినప్పుడు తాను కూడా రంజీ మ్యాచ్ లు ఆడి మళ్లీ మునుపటి ఫామ్ సాధించడానికి కష్టపడ్డాను అన్న విషయాన్ని గుర్తు చేశాడు సౌరబ్ గంగూలీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి