మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తన సుదీర్ఘమైన కెరీర్ లో మొదటి సారి రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. అయితే టీమిండియాకు వైస్ కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగిన నేపథ్యంలో కోహ్లీ అందుబాటులో లేనప్పుడు టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు రోహిత్ శర్మ. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కోహ్లీ రోహిత్ కెప్టెన్సీలో ఆడలేదు. కానీ మొదటిసారి స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న వన్డే సిరీస్లో కోహ్లీ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా రోహిత్ సారథ్యంలో ఆడుతున్నాడు.



 అయితే ఎన్నో రోజుల నుంచి రోహిత్ విరాట్ కోహ్లీ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు కెప్టెన్సీ తారుమారు అయిన సమయంలో వీరిద్దరూ మైదానంలో ఎలా వ్యవహరిస్తారు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే ఇటీవల అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించి శుభారంభం చేసింది. అయితే మొదటి వన్డే మ్యాచ్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక కష్టమైన టాస్క్ అప్పజెప్పాడు.


 సాధారణంగా పవర్ ప్లే సమయంలో మిడాన్ లేదా మీడాఫ్ లో ఫీలింగ్ చేస్తూ కనబడతాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత మిడ్ టికెట్ లేదా లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తాడు. కానీ ఇటీవలే మొదటి వన్డే మ్యాచ్లో మాత్రం అత్యంత డేంజర్ ప్లేస్ లో విరాట్ కోహ్లీని ఫీల్డింగ్ పెట్టాడు రోహిత్ శర్మ. నికోలస్ పూరన్ ని ఎల్బీడబ్ల్యూ గా కిరణ్ పోలార్డ్ గోల్డెన్ డక్ ఔట్ చేశాడు చాహల్. ఈ సమయంలో హ్యాట్రిక్ కోసం ఏకంగా ఫీల్డింగ్ లో మార్పులు చేశాడు రోహిత్ శర్మ. షార్ట్ లెగ్ లోకి విరాట్ కోహ్లీని మార్చాడు దీంతో విరాట్ కోహ్లీ డాగౌట్ నుండి హెల్మెట్ గాడ్ తెప్పించుకుని ఫీల్డింగ్   చేశాడు  అయితే మైదానంలో పాదరసంలా కదిలే కోహ్లీ మీద నమ్మకంతోనే డేంజరస్ ప్లేస్ లో కోహ్లీని రోహిత్ ను పెట్టాడు అంటూఅంటున్నారు ప్రేక్షకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: