కానీ ఈ రోజు జట్టులో కొన్ని మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఎలాగూ సీరీస్ గెలిచారు కాబట్టి, బెంచ్ కే పరిమితం అయిన యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం కరోనా కారణంగా రెండు వన్ డే లకు దూరమైన ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ రోజు మ్యాచ్ ఆడనున్నాడు. అయితే ఐపిఎల్ లో విశేషంగా రాణించి అందరినీ ఆకట్టుకున్న మధ్యప్రదేశ్ యువ సంచలనం రుతురాజ్ గైక్వాడ్ సైతం ఈ వన్ డే స్క్వాడ్ లో చోటు దక్కించుకున్నాడు. కానీ కరోనా కారణంగా మొదటి రెండు వన్ డే లకు అందుబాటులో లేడు. కానీ ఇప్పుడు కరోనా పూర్తిగా నయం అయ్యి రెఢీగా ఉన్నాడు.
అయితే ఈ మ్యాచ్ లో అవకాశం వస్తుందని గట్టి నమ్మకమే పెట్టుకుని ఉన్నాడు. మరి ఇండియా యాజమాన్యం ఈ యువ ఆటగాడికి అవకాశం ఇస్తారా ? లేదా ఇతనికి మొండి చెయ్యి చూపి మరో సారి బెంచ్ కే పరిమితం అయ్యేలా చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా మిస్టరీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్ లో అవకాశం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. మరి చూద్దాం ఫైనల్ గా తుది జట్టులో ఎవరు స్థానం సంపాదిస్తారు అన్నది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి