ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతంగా సత్తా చాటింది. ఒకవైపు స్టార్ ప్లేయర్స్ ఉన్న జట్లే  పేలవ ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో అసలు స్టార్ ఆటగాళ్లు లేని సన్రైజర్స్ హైదరాబాద్ పై ఎవరు అంచనాలు కూడా పెట్టుకోలేదు. కానీ ఐపీఎల్ లో ప్రస్థానం మొదలు పెట్టిన కొన్ని రోజుల్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది  యువ ప్రతిభ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న సన్ రైజర్ ఐపీఎల్లో దిగ్గజ జట్లకు సైతం చెమటలు పట్టించింది.


 ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే గత కొంత కాలం నుంచి హైదరాబాద్ జట్టులో వివాదాల కారణంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే కేవలం ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న సన్రైజర్స్ స్టార్ ప్లేయర్స్ ను మెగా వేలంలోకి వదిలేసింది. అయితే ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎంతోమంది కీలక ఆటగాళ్లు సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది అని అందరూ అనుకున్నారు.


 అయితే మెగా వేలం ప్రారంభం అయింది. కానీ మొదటి నుంచి ఒక్క ఆటగాడిని కూడా కొనుగోలు చేయలేక పోయింది సన్రైజర్స్ యాజమాన్యం  కానీ ఇటీవలే విరామానంతరం తొలి ఆటగాడిని సొంతం చేసుకుంది 8.75 కోట్లతో వాషింగ్టన్ సుందర్ ను సొంతం చేసుకుంది హైదరాబాద్ ఫ్రాంచైజీ. కాగా వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొంత సమయం లోనే తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. 

ఇకపోతే మెగా వేలంలో ఎలాంటి ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం దృష్టి పెట్టింది అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది  చూడాలి ఎవరెవరు హైదరాబాద్ జట్టు లోకి వస్తారు అని..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl