ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు  ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు సాధించిన రికార్డులను తక్కువ సమయంలోనే బ్రేక్ చేసి తన పేరును లిఖించుకున్నాడు విరాట్ కోహ్లీ. అందుకే విరాట్ కోహ్లీని పరుగుల యంత్రం అని కొంతమంది అభిమానులు అంటూ ఉంటే రికార్డుల రారాజు అని మరికొంత మంది అంటూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో ఎంతో అద్భుతమైన రికార్డులు అటు విరాట్ కోహ్లీ ముందు దాసోహం అంటూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇలా ప్రతి మ్యాచ్లో కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ తన ఆటతీరుతో అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. ఇకపోతే ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు సరికొత్త రికార్డును సాధించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. కాగా మొన్నటి వరకు భారత క్రికెట్ లో మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం జట్టులో ఒక సాదాసీదా ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం కెప్టెన్సీ  వదులుకున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు.



 ఇకపోతే ప్రస్తుతం విరాట్ కోహ్లీ ముందు ఒక ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్తో వన్డే సిరీస్లో ఆడిన టీమిండియా ఇక ఇప్పుడు టి20 సిరీస్ ఆడటానికి సిద్ధమైంది. ఇక ఇలాంటి సమయంలోనే విరాట్ కోహ్లీ మరో 73 పరుగులు చేసాడు అంటే చాలు అంతర్జాతీయ టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ గఫ్టిల్ 3299 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా 3227 పరుగులతో రెండవ స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇక 3197 పరుగులతో  రోహిత్ శర్మ  మూడో స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం. ఇంకా 73 పరుగులు చేస్తే అరుదైన రికార్డు సాధించపోతున్నాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: