ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీ సహచరుడు టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కు టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతలు అప్పగించాడు. ఇక ఇద్దరు క్రికెటర్లు కూడా అటు భారత క్రికెట్ దిగ్గజాలు. ఇకపోతే ఇద్దరు క్రికెటర్లు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. భారత్ వెస్టిండీస్ మధ్య టి20 సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్.. బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈడెన్ గార్డెన్స్ లో ప్రత్యక్షమయ్యారు.
నేటి నుంచి టి20 సిరీస్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇక అటు మైదానాన్ని పరిశీలించేందుకు ఇద్దరు ఈడెన్ గార్డెన్స్ స్టేడియం కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు దీనిని క్లిక్ మనిపించారూ. ఇక ఈ ఫోటోని అటు బిసిసిఐ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈడెన్ గార్డెన్స్ లో భారత్కు చెందిన ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు కలిసిన వేళ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా ఈ ఇద్దరు క్రికెటర్లు కలిసి టీమిండియా తరఫున 370 మ్యాచ్లు ఆడారు. ఇప్పుడు భారత క్రికెట్ లో అత్యున్నత పదవులలో కొనసాగుతుండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి