ప్రస్తుతం భారత క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్గా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. కానీ గత కొంత కాలం నుంచి పేలవమైన ఫామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడూ. ఈసారి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగే విరాట్ కోహ్లీ తక్కువ స్కోరుకే వికెట్ చేజార్చుకుంటూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టినా విరాట్ కోహ్లీ పేలకమైన ఫామ్ లో విమర్శలు ఎదుర్కొంటు ఉండడంతో అభిమానులను కూడా తీవ్ర నిరాశలో మిగిలిపోతున్నారు. ఇకపోతే మొన్నటికి మొన్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో మూడు ఫార్మట్ల కెప్టెన్సి నుంచి కూడా తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ.


ఇకపోతే ప్రస్తుతం  విరాట్ కోహ్లీని పక్కన పెట్టేశారు.. ఏంటి విరాట్ కోహ్లీని పక్కన పెట్టేశారా.. మీరు చెబుతుంది నిజమేనా... అని షాక్ అవుతున్నారు కదా.. అంతలా షాక్ అవ్వకండి విరాట్ కోహ్లీని కేవలం విశ్రాంతి ఇవ్వడం కోసం పక్కన పెట్టారు. గత కొంత కాలం నుంచి నిర్విరామంగా విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే  ఇక బయో బబుల్ లో ఉంటూ కేవలం క్వారంటైన్ కే పరిమితం కావడంతో ఇటీవల ఆటగాళ్ళు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు  ఈ క్రమంలోనే కొంతకాలం నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఫిబ్రవరి 24 వ తేదీ నుంచి శ్రీలంకతో  టి 20, టెస్ట్ సిరీస్ కోసం ఆడబోతుంది టీం ఇండియా. కాగా మొదట జరిగే టి20 సిరీస్ కోసం కోహ్లీకి విశ్రాంతి ఇస్తున్నట్లు ప్రముఖ క్రికెట్ సైట్ క్రిక్ బజ్ తెలిపింది. మార్చి నాలుగో తేదీ స్టార్ట్ అయ్యే టెస్ట్ సిరీస్ కు మాత్రం కోహ్లీ అందుబాటులో ఉంటాడట  నవంబర్లో గాయపడిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అందుబాటు లోకి వస్తాడు అన్నది తెలుస్తుంది. మొన్నటి వరకు బెంగళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీ లో గాయం నుంచి కోలుకుని మళ్ళీ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడూ జడేజా. బుమ్రా, మహమ్మద్ షమి కూడా జట్టులో చేరనున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: