ఆ తర్వాత కివీస్ తన మొదటి ఇన్నింగ్స్ లో 482 పరుగులు చేసి సఫారీల ముందు 387 పరుగుల లోటును ఉంచింది. అయితే రెండవ ఇన్నింగ్స్ లోనూ సఫారీల రాత మారలేదు. ఈ సారి సీనియర్ బౌలర్ టీమ్ సౌతీ పేస్ కు దాసోహం అంది. అయితే మొదటి ఇన్నింగ్స్ కన్నా కొంచెం మెరుగ్గా ఆడిందని చెప్పాలి. ఈ సారి 111 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్ 276 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా అయిదు రోజుల పాటు జరగాల్సిన టెస్ట్ కేవలం రెండున్నర రోజులకే ముగిసిపోవడం విశేషం.
మరి రెండవ టెస్ట్ లో అయినా సౌత్ ఆఫ్రికా పుంజుకుని రెండు టెస్ట్ ల సీరీస్ ను సమం చేస్తుందా లేదా కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ కు గురవుతుందా అన్నది తెలియాలంటే ఫిబ్రవరి 25 వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇండియా తో టెస్ట్ సిరీస్ లోనూ మొదటి టెస్ట్ ఓడిపోయినా తర్వాత పుంజుకుని ఏకంగా వరుసగా రెండు టెస్ట్ లు గెలుచుకుని సిరీస్ ను చేజిక్కించుకుంది. మరి అలా ఏమైనా జరుగుతుందా లేదా అనేది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి