ప్రస్తుతం టీమిండియాలో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టి  కింగ్ కోహ్లీ గా మారిపోయాడు. అంతేకాదు మొన్నటి వరకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా కొనసాగి.. ఇక ఇప్పుడు కెప్టెన్సీ వదులుకొని  సాదాసీదా ఆటగాడిగా ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా సీనియర్ క్రికెటర్ గా ఉన్న విరాట్ కోహ్లీ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మధ్య ఎంతో గొప్ప అనుబంధం ఉంది. ఎన్నో ఏళ్ల పాటు ఇద్దరు కలిసి క్రికెట్ ఆడారు. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న యువి ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.


 ఇది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కోహ్లీ ఒక క్రికెటర్ గా వ్యక్తిగా నువ్వు ఎదిగిన తీరు నేను కళ్ళారా చూసాను. ఒకప్పుడు నెట్స్ లో టీమిండియా దిగ్గజాలతో భుజం రాసుకుంటూ తిరిగిన ఓ యువకుడు..  ఇక ఇప్పుడు తన ఆటతో తన వ్యక్తిత్వంతో నవతరానికి ఒక స్ఫూర్తి దాత గా ఎదిగిపోయావ్. నీ క్రమశిక్షణ ఆట పట్ల అంకితభావం నిబద్ధత.. దేశంలో ఉన్న ప్రతి యువ ఆటగాడిలో కూడా స్పూర్తిని నింపుతూ ఉంటుంది. నీ ప్రయాణాన్ని చూసిన తర్వాత టీమిండియాకు ఆడతా అన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.


 అంతకంతకు నీ ఆటతీరు మెరుగుపడిన విధానం ఎంతో అద్భుతం.. నువ్వు ఒక లెజెండరీ కెప్టెన్ వి గొప్ప నాయకుడువి కూడా. నీ నుంచి మరెన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సహచర ఆటగాడిగా స్నేహితుడిగా నీతో ఉన్న బంధాన్ని మాటల్లో వర్ణించలేను. కలిసి పరుగులు సాధించడం డైట్ విషయంలో చీటింగ్.. పంజాబీ పాటలు వినడం కప్ గెలవడం వరకు కూడా అన్నింటిలో కలిసే ఉన్నాం.. నువ్వు ప్రపంచానికి కింగ్ కోహ్లీ కావచ్చు కానీ నాకు మాత్రం ఎప్పటికీ 'చీకు' వే. నీ పట్టుదల గెలవాలన్న కసి ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటూన్న అంటూ యువరాజ్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కోహ్లీ కోసం గోల్డెన్ బూట్స్ కూడా కానుకగా పంపించాడు యువరాజ్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: