ఇక మ్యాచ్ స్వరూపాన్ని మార్చే దిశగా ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటూ రోహిత్ శర్మ జట్టును ముందుకు నడిపిస్తున్న తీరు అద్భుతంగా ఉంది అంటూ ఇప్పటికే పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభిప్రాయం వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ సైతం రోహిత్ శర్మ పై ప్రశంసల వర్షం కురిపించాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రయోగాలు చేస్తూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించాడు. శ్రీలంకతో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ మూడవ స్థానంలో దింపి జడేజాను నాలుగో స్థానంలో బ్యాటింగ్ పంపి రోహిత్ శర్మ మంచి ఫలితాన్ని రాబట్టాడు.
ఇద్దరు ఆటగాళ్ళు ఎంతో దూకుడుగా ఆడుతూ ఉంటారు. దీంతో భారత అలవోకగా విజయం సాధించింది. ఇక ప్రస్తుతం రోహిత్ శర్మ ఏది ముట్టుకున్నా బంగారమే అవుతుంది.. అందుకే రోహిత్ తో కరచాలనం చేయాలన్నా జాగ్రత్తగా ఉండాలి.. ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకోవడం ఆటగాళ్లను రోటేట్ చేయడం ఇక బౌలింగ్ లో కూడా మార్పులు చేయడం ఇలా ప్రతి అడుగులో కూడా రోహిత్ శర్మ మాస్టర్ పీస్ లా కనిపిస్తున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించాడు. ఇటీవలే 3వ టి20 మ్యాచ్ లో గెలిచిన టీమిండియా ప్రత్యర్థి శ్రీలంక ను క్లీన్ స్వీప్ చేసి అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి