ఇటీవలి కాలంలో భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే మొన్నటి వరకు భారత జట్టులో చోటు దక్కడం కష్టంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ ఇటీవలి కాలంలో వరుసగా టీమిండియాలో అవకాశాన్ని దక్కించుకున్నాడు. అంతేకాదు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా తన బ్యాటింగ్తో ప్రశంసలు అందుకున్నాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్.


 ఈ క్రమంలోనే ఎంతో మంది మాజీ క్రికెటర్లు అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల యువ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ పై సభ కరీం ప్రశంసలు కురిపించాడు. ఒకవైపు అతని ప్రతిభను ప్రశంసిస్తూనే   మరోవైపు అతని ముందున్న సవాళ్లను కూడా గుర్తు చేశాడు సభ కరీం. శ్రీలంకతో జరిగిన మూడు టి20ల సిరీస్  భారత్ కైవసం చేసుకోవడంలో శ్రేయస్ అయ్యర్ పాత్ర ఎంతో కీలకం.. మూడు మ్యాచ్ లలో  కూడా మూడు అర్థ శతకాలతో రాణించి 204 పరుగులు చేశాడు.  తన ఆటను మరింత మెరుగు పరుచుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు.


 అయితే ఇప్పుడు అందరూ సూర్యకుమార్ యాదవ్ ను 360 డిగ్రీల ఆటగాడు అని పిలుస్తున్నారు. అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ఆట చూస్తే ఎక్కడి నుంచి అయినా సరే పరుగులు రాబట్టగల సత్తా అతని సొంతం అని అర్థమవుతుంది అంటూ ప్రశంసించాడు సభ కరీం. అయితే రాబోయే కాలంలో కఠినమైన ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొనే సమయంలో శ్రేయస్ అయ్యర్ ప్రతిభకు అసలైన సవాలు ఎదురవుతుందని చెప్పుకొచ్చాడు. కఠినమైన బౌలింగ్  దాడి ఎదురైనప్పుడు పరుగులు రాబట్టాలి.. ఆది శ్రేయస్ అయ్యర్ కు అసలైన సవాల్.. శ్రీలంక బలహీనమైన జట్టు అనుభవం లేని బౌలర్లు అందుకే పెద్ద జట్లతో ఆడేటప్పుడు ఎన్నో ఛాలెంజ్ లు ఎదురవుతాయి అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: