రోహిత్ శర్మ కెప్టెన్సీలో ప్రస్తుతం మొహాలీ వేదికగా శ్రీలంకతో టీమిండియా ఆడుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించింది. ఒక ఇన్నింగ్స్ మిగిలివుండగానే 222 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. భారత క్రికెట్ అభిమానులు అందరూ కూడా.. ఇక ఈ విజయంతో సంతోషం లో మునిగి పోయారు అని చెప్పాలి. కానీ విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం నిరాశ లో మునిగిపోయారు. ఎందుకంటే ఇటీవలే మొహాలీలో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ విరాట్ కోహ్లీ కెరియర్ లో 100 టెస్ట్ అన్న విషయం తెలిసిందే.



 అయితేఇక మొదటి టెస్టు మ్యాచ్ ముందు ఇక ఈ టెస్ట్ మ్యాచ్ను విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకంగా మారుస్తానంటూ రోహిత్ శర్మ మాటిచ్చాడు. ఇక రోహిత్ శర్మ మాట ఇచ్చినట్లుగానే ఇండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అయితే విరాట్ కోహ్లీ వందవ టెస్టులో టీమిండియా అద్భుతమైన విజయం సాధించడంతో అభిమానులందరికీ కూడా ఎంతో సంతోషకరమైన వార్త అయినప్పటికీ కోహ్లీ అభిమానులు ఎందుకు నిరాశలో మునిగిపోయారు అనే కదా మీ డౌట్.. విరాట్ కోహ్లీ తన వందో టెస్టు మ్యాచ్లో సెంచరీ చేస్తాడు అని అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు.



 గత రెండేళ్ల నుంచి సెంచరీకి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ వందో టెస్ట్ మ్యాచ్లో మాత్రం సెంచరీ చేసి అభిమానులను నిరీక్షణకు  తెరదించుతాడు అని అందరు అనుకున్నారు. అయితే మొదటి ఇన్నింగ్స్ లో 45 పరుగులకు వికెట్ చేజార్చుకున్నాడు విరాట్ కోహ్లీ. తన రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఇక మిగతా పరుగులు చేసి సెంచరీ పూర్తి చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ టీమిండియా రెండవ ఇన్నింగ్స్ ఆడకుండానే విజయం సాధించింది. ఎందుకంటే మొదటి ఇన్నింగ్స్ లో 174, రెండవ ఇన్నింగ్స్ లో  178 పరుగులు చేసి ఆలౌట్ అయింది శ్రీలంక . టీమిండియా  మాత్రం మొదటి ఇన్నింగ్స్లో 574 పరుగులు చేసింది. దీంతో ఇన్నింగ్స్ మిగిలివుండగానే 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ కోహ్లీ అభిమానులకు 100వ టెస్టులో సెంచరీ ఆశ మాత్రం తీరకుండా పోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: