ఇక అభిమానులు క్రికెటర్లు మాజీ ఆటగాళ్లు స్పందించడమే కాదు రావల్పిండి పిచ్ పై స్వయంగా ఐసిసి స్పందించింది. టెస్ట్ క్రికెట్ లో నే రావల్పిండి పిచ్ అత్యంత చెత్త పిచ్ అని పనిచేస్తుంది. కనీస ప్రమాణాలు కంటే తక్కువ స్థాయిలో నాసిరకమైన పిచ్ తయారు చేశారంటూ మ్యాచ్ రిఫరీ రంజాన్ మధుగలే చెప్పుకొచ్చారు. అయితే ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ లో ఉపయోగించిన రావల్పిండి పిచ్ లో తొలి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఎలాంటి మార్పు కనిపించలేదు. అటు స్పిన్నర్లు ఇటు పేసర్లకు కూడా ఎక్కడా ప్రభావం చూపించలేదు.
నిజం చెప్పాలంటే ఇది క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త పిచ్ అని చెప్పవచ్చు. పిచ్ పై బంతికి ఏమాత్రం సహకారం అందలేదు. రెండు రోజులు అంటే పర్వాలేదు ఐదు రోజులు కూడా ఒక పిచ్ పై ఎలాంటి మార్పులు లేకపోవడం అనేది ఆశ్చర్యం కలిగించింది. అందుకే రవాల్పింది పిచ్ కి అత్యంత సాధారణ పిచ్ గా రేటింగ్ ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చారు రిఫరీ రంజన్ మాదిగలే. ఈ క్రమంలోనే స్పందించిన ఐసీసీ నాసిరకం పిచ్ తయారు చేసినందుకు గాను పాకిస్తాన్ కు డి మెరిట్ పాయింట్ పెనాల్టీ గా విధించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి