అదే సమయంలో ఐపీఎల్ లో కి కొత్త గా ఎంట్రీ ఇస్తున్న లక్నో గుజరాత్ జట్లు మొదటి సీజన్లో టైటిల్ గెలవాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాయ్. ఇక ఇలాంటి సమయంలోనే ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఇక ఈ ఏడాది సీజన్ వరకు ఎవరు అద్భుతంగా రాణించారు ఎవరు ఎక్కువ క్యాచ్లు పట్టారు. ఎవరు ఎక్కువ పరుగులు చేశారు అన్నది మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఇక ఐపీఎల్లో ఇప్పటివరకు ఎవరు ఎక్కువ క్యాచ్లు పట్టారూ అన్న విషయానికి వస్తే.. ఇటీవల ఐపీఎల్లో అన్ సోల్డ్ గా మిగిలిపోయిన మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా టాప్ లో ఉన్నాడు అని చెప్పాలి.
ఒకసారి ఆ డీటెయిల్స్ చూసుకుంటే.. సురేష్ రైనా 205 మ్యాచ్ లలో 109 క్యాచ్ లు పట్టాడు. కిరణ్ పోలార్డ్ 178 మ్యాచ్లలో 96 క్యాచ్ లు పట్టాడు.. రోహిత్ శర్మ 184 మ్యాచ్లలో 90 క్యాచ్లు అందుకున్నాడు. ఎబి డివిలియర్స్ 213 మ్యాచ్లలో 90 క్యాచ్ లు అందుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ 205 మ్యాచ్లలో ఏకంగా 84 క్యాచ్ లు అందుకున్నాడు. ధావన్ 192 మ్యాచ్లలో 82 క్యాచ్ లు అందుకున్నాడు. రవీంద్ర జడేజా రెండు వందల మ్యాచ్లు ఆడి 81 అందుకోవడం గమనార్హం బ్రావో 151 మ్యాచ్లు ఆడి 77 క్యాచ్లు అందుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్ వీరుడు ఇక ఇటీవలే మెగా వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయిన సీనియర్ ఆటగాడు సురేష్ రైనా టాప్ లో ఉన్నాడు అని చెప్పాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి