క్రికెట్ ఆట కి ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉంది మాటల్లో చెప్పలేం. ఎన్నో దేశాల్లో క్రికెట్ అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఎంతో మంది. క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే టీవీలకు అతుక్కుపోయే ప్రేక్షకులు ఇంకెంతో మంది. అందుకే ఇటీవల కాలంలో  ఎంతో మంది  క్రికెట్ ఫ్యాషన్గా మార్చుకుంటూ ఉండటం గమనార్హం. ఒక్కసారి అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెడితే కోట్లకి కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే ఇటీవల కాలంలో అటు పురుషులకు క్రికెట్ తో పాటు మహిళల క్రికెట్ కి కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.


 మహిళా క్రికెటర్లు సైతం ఎంతో అద్భుతంగా రాణిస్తూ క్రికెట్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా అన్ని జట్లు కూడా ఎంతో వ్యూహాత్మకంగా బరిలోకి దిగుతూ కప్పు కొట్టడం లక్ష్యంగా హోరాహోరీగా పోరాడుతున్నాయ్.  కొన్ని కొన్ని సార్లు ఉత్కంఠభరితంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో  ప్లేయర్స్ ఎంతో ఎమోషన్ తో ఉంటారు. అలాంటి  ఫోటోగ్రాఫర్లు ఫోటో క్లిక్ మనిపించటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో కి వచ్చినప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి.


 ఇలాంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. రాతల కంటే కొన్ని ఫోటోలు అందులోని భావాన్ని స్పష్టంగా చెబుతాయ్ అనేదానికి ఈ ఫోటో నిదర్శనంగా మారింది. ఓకే ఫోటోలో రెండు ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. నిన్న మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక చివరి బంతి వరకు కూడా మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా మారిపోయిందని చెప్పాలి. చివరి బంతికి 5 పరుగులు చేస్తే విజయం దక్కుతుంది అన్న దశలో బంగ్లాదేశ్ మ్యాటర్ పరిహ  క్లీన్ బౌల్డ్ అయింది. ఇక ఈ బాధతో ఫరిహ నిరాశలో మునిగిపోగా..  వెస్టిండీస్ బౌలర్ టైలర్  గర్వంగా ఆకాశాన్ని చూసింది.  ఇక ఈ ఫోటో క్లిక్ మనిపించిన ఫోటోగ్రాఫర్ పై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: