క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ సెలబ్రిటీలకు అయినా ఒకే ప్రాంతానికి క్రేజ్ పరిమితమవుతూ ఉంటుంది. కానీ అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న క్రికెటర్లకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతగానో పాపులారిటీ ఉంటుంది. అందుకే క్రికెటర్లకు సంబంధించిన ఏదైనా  విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అదీ క్షణాలు వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇలా కొన్ని కొన్ని సార్లు క్రికెటర్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో కి వచ్చి అందరినీ షాక్ అయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఒకటి వైరల్ గా మారిపోయింది.

 ఏకంగా ఒక ఇంగ్లాండ్ క్రికెటర్ పై ఆ దేశ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది అన్నది తెలుస్తుంది.ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ లో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు జేసన్ రాయ్. ఒకవైపు అద్భుతంగా బ్యాటింగ్ లో అదరగొడుతునే మరోవైపు బౌలింగ్ లో కూడా సత్తా చాటుతూ ఉన్నాడు. ఇక ఇంగ్లండ్ జట్టులో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఇక ఎన్నో సార్లు జట్టులో తన అద్భుతమైన ప్రదర్శనతో విజయాలు అందించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి స్టార్ క్రికెటర్ జాసన్ రాయ్ పై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిషేధం విధించడం మాత్రం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.



 ఏకంగా రెండు మ్యాచ్ ల వరకు నిషేధం విధిస్తూన్నాము అంటూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఇక ఇలా జాసన్ రాయ్ పై నిషేధం విధించడానికి గల కారణాలు ఏంటి అన్న విషయం మాత్రం వెల్లడించలేదు. జాసన్ రాయ్ క్రికెట్ నిభందనలు ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఇక ఈ నిషేధం నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు ఆడబోయే రెండు మ్యాచ్ లలో కూడా ఇక ఈ స్టార్ ప్లేయర్ దూరం కాబోతున్నాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక ప్రవర్తన మార్చుకోకపోతే మరో 12 నెలల పాటు జట్టులో స్థానం ఉండదు అంటూ హెచ్చరించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఇక 2500 పౌండ్ల జరిమానా కూడా విధించటం గమనార్హం. ఇక ఈ విషయం తెలిసి అసలు ఏం జరిగి ఉంటుందా అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు  మొదలు పెట్టారు అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి: