సాధారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయిందంటే చాలు ఎప్పుడూ వార్తల్లో ఏదో ఒక ఆటగాడి పేరు వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ లో యువ ఆటగాళ్లు అద్భుతమైన సత్తా చాటుతూ తమ పేరును మారుమోగేలా చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఒక ఆటగాడి పేరు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.  అతనెవరో కాదు కోల్కత నైట్రైడర్స్ ఆటగాడు సౌరాష్ట్ర వికెట్ కీపర్ షెల్టన్ జాక్సన్. ఇతని పేరు కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారిపోయింది.


 అదేంటి ఐపీఎల్ ప్రారంభానికి ముందే అతని పేరు ఎలా వైరల్ గా మారిపోయింది అని అనుకుంటున్నారు కదా.. ఈ ఆటగాడి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోవడం కి కారణం ఒక సీనియర్ జర్నలిస్టు చేసిన పని అని తెలుస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్ 15వ సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ మీడియా ఛానల్స్ ప్యానల్ చర్చలు జరుపుతున్నాయి. ఇక వారి చర్చలో భాగంగా ఐపీఎల్ విజేతగా నిలిచే అవకాశం ఎవరికి ఉంది జట్టు బలాబలాలు ఆయా జట్ల గేమ్ స్ట్రాటజీ ఏంటి అన్న దానిపై సీరియస్గా చర్చ కొనసాగించారు. ఒక మీడియా ఆధ్వర్యంలో ప్యానల్ లో కోల్కత నైట్రైడర్స్ జట్టు చర్చకు వచ్చింది.



  ఒక సీనియర్ జర్నలిస్టు ఇదే జట్టులోని షెల్టన్ జాక్సన్ విదేశీ ప్లేయర్ గా అభివర్ణించాడు. అయితే నిజంగానే షెల్టన్ జాక్సన్ పేరు విదేశీయుల పేరుకు ఎంతో దగ్గరగా ఉంటుంది. దీంతో అతను పారిస్ ప్లేయర్ ఏమో అని అనుకున్నాడు ఆ సీనియర్ జర్నలిస్ట్. అతని గురించి మాట్లాడేటప్పుడు అతను ఒక విదేశీ ఆటగాడు అని సంబోధించాడు. ఇంత జరిగిన తర్వాత అభిమానులు ఊరుకుంటారా.. పెద్ద చర్చ మొదలు పెట్టారు. విదేశీ ఆటగాడికి మనోడికి తేడా తెలియటం లేదా.. సరైన అవగాహన లేని ప్రతి ఒక్కరు కూడా మీటింగ్లు పెడుతున్నారు. ఎవరు ఏ దేశానికి చెందిన ఆటగాడు తెలుసుకుని చర్చ జరిగితే బాగుంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఈ విషయాన్ని గ్రహించిన సీనియర్ జర్నలిస్టు అందరికీ క్షమాపణ చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl