ఇటీవలి కాలంలో టీమిండియా లో రవీంద్ర జడేజా రాణిస్తూ ఉన్నప్పటికీ అతనికి మరో వైపు నుంచి సహకారం అందించేందుకు ఎవరు ఉండటం లేదు. ఈ క్రమంలోనే ఆ తర్వాత ఇక బౌలర్లు బ్యాటింగ్ కి వచ్చి వరుసగా వికెట్లు కోల్పోతూ ఉండడంతో ఇక రవీంద్ర జడేజా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ సరైన మద్దతు అందకపోవడంతో టీమిండియా కొన్ని కొన్ని సార్లు ఓటమి కూడా చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.
టీమిండియాలో ఆరవ స్థానంలో రాణించగా ఆల్రౌండర్ అవసరం ఎంతైనా ఉంది అని రావిశాస్త్రి చెప్పుకొచ్చాడు. వెన్నెముక గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా మళ్లీ జట్టులోకి రావాలి అంటే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. టాప్ ఫైవ్ లో ఎవరో ఒకరు రెండు మూడు ఓవర్లు బౌలింగ్ చేసే సత్తా కలిగి ఉంటే కెప్టెన్ కి ఒత్తిడి ఎంతగానో తక్కువ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యా జట్టులోకి రావాలి అంటే తప్పకుండా ఆల్రౌండ్ ప్రదర్శన చేయాల్సిందే అంటూ తెలిపాడు రవి శాస్త్రి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి