ఎంతో మంది యువ ఆటగాళ్ళు ఈ మెగా టోర్నీలో తమ ప్రతిభను నిరూపించుకునీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ప్రతి సీజన్ కూడా అంత కంతకు ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్.. కాగా రేపటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ఒక రోజు ముందు బీసీసీఐ ప్రేక్షకులు అందరికీ కూడా శుభవార్త చెప్పింది. మహిళల ఐపీఎల్ కూడా నిర్వహిస్తామంటూ ప్రకటించింది.
పురుషుల ఐపీఎల్ తో పాటు వచ్చే ఏడాది నుంచి ఆరు జట్లతో కూడిన మహిళ ఐపీఎల్ కూడా నిర్వహించేందుకు సిద్ధమయ్యాము అంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఇటీవలే ముంబై లో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం లో ఇక ఈ విషయం పై నిర్ణయం తీసుకున్నాము అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. మహిళల ఐపీఎల్ కు విపరీతమైన డిమాండ్ ఉన్నదనీ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది. ఇక మహిళల ఐపీఎల్ కూడా రాబోతుంది అని తెలియడంతో ప్రస్తుతం అందరూ ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి