ఎందుకంటే ప్రత్యర్థి రాజస్థాన్కు ఎక్కడా కనీస పోటీ ఇవ్వకుండా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇలాంటి సమయంలోనే ఇక సన్రైజర్స్ మళ్లీ అద్భుతంగా రాణించగలదా అనే అనుమానం కూడా ప్రేక్షకుల పెరిగిపోయింది. అయితే ఇక ఇదే విషయంపై మాట్లాడినా హైదరాబాద్ ప్రధాన కోచ్ టామ్ మూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కీలక పాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. వాషింగ్టన్ సుందర్ అటు బౌలింగ్లో పరుగులు సమర్పించుకున్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం 14 బంతుల్లోనే 40 పరుగులు చేసి ఎంతో అద్భుతంగా ఆడాడని గుర్తు చేసాడు టామ్ మూడి.
వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఆల్రౌండర్ అని గుర్తుంచుకుని మెగా వేలంలో కొనుగోలు చేశాం అంటూ చెప్పుకొచ్చిన టామ్ మోడీ.. అందుకే వచ్చే మ్యాచుల్లో ఒకవైపు బ్యాటింగ్లో మరోవైపు బౌలింగ్ లో కూడా వాషింగ్టన్ సుందర్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక పాత్ర పోషిస్తాడు అని భావిస్తూన్నాము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ చేశాడు.కానీ అది అతనికి శాశ్వతం కాదు ఏ స్థానంలో నైనా ఆడేందుకు సిద్ధంగా ఉంటాడు. ఇక క్లిష్ట సమయంలో ఎంతో హుషారుగా అవకాశ వాద దృక్పథంతో వుండాలని కేన్ విలియమ్సన్ తన సహచరులకు సూచించాడు అంటు టామ్ మూడి గుర్తు చేసుకున్నాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి