గుజరాత్ తరపున బరిలోకి దిగుతున్న రషీద్ ఖాన్ తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో మరోసారి అదరగొడుతున్నాడు. అయితే ఇటీవలే తన స్పిన్ బౌలింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను అసలు లెగ్ స్పిన్నర్ కాదు అంటూ చెబుతున్నాడూ రషీద్ ఖాన్. సాధారణంగా నెమ్మదిగా బంతి వేస్తూ గింగిరాలు తిప్పే వాళ్ళనీ స్పీన్నర్లు అని వేగంగా బంతులు వేసేవారని ఫాస్ట్ బౌలర్లు అని అంటూ ఉంటారు. కానీ అతను మాత్రం గంటకు సుమారు వంద కిలోమీటర్ల వేగంతో బంతులు చేస్తూ స్పిన్ మాయాజాలం చూపిస్తూ ఉంటాడు. అందుకే తాను ఫాస్ట్బౌలర్ ని అని చెప్పుకుంటున్నాడూ రషీద్ ఖాన్.
వేగంతో బౌలింగ్ చేస్తా కాబట్టి నేను స్పిన్ ఫాస్ట్ బౌలర్ ని. గంటకు 96 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తూ ఉంటాను.. అంత వేగం తో వేసిన బంతిని స్పిన్ చేయడం అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని.. అందుకోసం ఎంతో భిన్నమైన నైపుణ్యాలు ఉండి ఉండాలి..అయితే వేగాన్ని తగ్గించి బంతిని ఎక్కువగా తిప్పాలని నేను ఎప్పుడూ అనుకోను.. వేగంతోనే లెగ్ స్పిన్ వేయడానికి ఇష్టపడతాను. కేవలం ఒక లెగ్ స్పిన్నర్ ని మాత్రమే అని ఎప్పుడూ అనుకోను.. ఎందుకంటే స్పిన్నర్లు తమ మణికట్టు ఎక్కువగా వాడతారు.. నేను ఎక్కువగా మణికట్టు ఉపయోగించను.. వేళ్ళని మాత్రమే వాడుతూ ఉంటాను. నిలకడగా ఒకే లైన్ లెన్త్ వేస్తాను. సరైన ప్రాంతంలో బౌలింగ్ వేసినంత కాలం తిరుగుండదు. ఇక మిగతా లెగ్ స్పిన్నర్ ల కంటే భిన్నంగా బౌలింగ్ వేస్తున్న అంటే అది నా లెన్త్ వల్లే అంటూ చెప్పుకొచ్చాడు రషీద్ ఖాన్. ఇప్పుడు వరకు 312 టి20 మ్యాచ్ లలో 436 వికెట్లు పడగొట్టాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి