వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కళ్లెం వేసింది. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ను ఓడించిన బెంగళూరు జట్టు విజయఢంకా మోగించింది. ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది బెంగళూరు జట్టు. వాంఖడే   స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 169 పరుగులు చేసింది. ఈ క్రమంలో 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు మొదట ఎంతగానో తడబడింది.


 ఈ క్రమంలోనే ఇక బెంగళూరు జట్టు ఓటమి ఖాయం అని అందరూ అనుకున్నారు. ఆ సమయంలోనే క్రీజులోకి వచ్చాడు దినేష్ కార్తీక్. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టుకు సరికొత్త ఊపిరి పోసాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దినేష్ కార్తీక్  క్రీజులోకి వచ్చిన తర్వాత ప్రతి బంతిని కూడా బౌండరీ కి తరలించాడు. 23 బంతుల్లో నాలుగు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు దినేష్ కార్తీక్. ఇక మరో ఎండ్ లో ఉన్న షాబాజ్ అహ్మద్  ఇరవై ఆరు బంతులలో 45 పరుగులు చేసి అద్భుతమే సృష్టించాడు. ఇందులో 4 ఫోర్లు 3 సిక్సర్లు ఉండటం గమనార్హం.


 అయితే మొదట బెంగళూరు జట్టు ఇన్నింగ్స్ ఎంతో శుభారంభం చేసింది అని చెప్పాలి. కెప్టెన్ డూ ప్లేసెస్  29, అనుజ్ రావత్ 26 తొలి వికెట్కు 55 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత చాహల్ మాత్రం వీరిని బోల్తా కొట్టించాడు. డూప్లెసిస్ ని అవుట్ చేసిన చాహల్ రాజస్థాన్ రాయల్స్ ఒక బ్రేక్ అందించాడు. తరువాత వచ్చిన విరాట్ కోహ్లీ రనౌట్ అయ్యాడు. కాసేపటికే విల్లే గోల్డెన్ డక్ గా పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత రావన్ సైతం సైని అవుట్ చేయడంతో ఇక ఆర్సిబి కష్టాల్లో కూరుకుపోయింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ మాత్రం జట్టును ఆదుకున్నాడు అని చెప్పాలి. కేవలం కొన్ని బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl