ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంత దిగ్గజ జట్టుగా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఎక్కువసార్లు ప్లే ఆఫ్స్ చేరిన జట్టుగా ఎక్కువసార్లు ఫైనల్ ఆడిన జట్టుగా కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇక తిరుగు లేదు అనే విధంగానే ప్రస్థానాన్ని కొనసాగించి అన్న విషయం తెలిసిందే. ప్రతి సీజన్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఎప్పుడూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటుంది చెన్నై సూపర్ కింగ్స్.


 అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. అదే డాడీస్ ఆర్మీ అని. సాధారణంగా ప్రతి జట్టులో యువ ఆటగాళ్లు ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ లో మాత్రం అనుభవం గల సీనియర్ ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. ఇక ఇలా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఆటగాళ్లు కూడా ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్ లో కనిపిస్తూ ఉంటారు. అందుకే అందరూ చెన్నై సూపర్ కింగ్స్ ను డాడీస్ ఆర్మీ అంటూ చులకన చేస్తూ ఉంటారు. డాడీస్ ఆర్మీ  గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువసార్లు టైటిల్ విజేత గా నిలిచి ఎప్పుడూ అందరిని నోళ్లు మూయిస్తూ వచ్చింది అని చెప్పాలి.



 ఇకపోతే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ పై భారత క్రికెటర్ అమిత్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరోక్షంగా సీఎస్కే పై సెటైర్లు వేశాడు. చెన్నై జట్టు లోకి రావాలని ఒక అభిమాని కోరగా స్పందించిన అమిత్ మిశ్రా సారీ నాకు ఇంకా రెండేళ్ల వయసు తక్కువగా ఉంది అంటూ సెటైర్ వేసాడు. చెన్నై సూపర్ కింగ్స్ లో ఎక్కువ వయసు ఉన్న ఆటగాళ్లు ఉన్నారు అని నేను యువకుడిని అంటూ అర్థం వచ్చేలా కామెంట్ చేసాడు. దీంతో సీఎస్కే అభిమానులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కన్ ఛార్జర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున ఆడాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Csk