ఐపీఎల్ లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్  మధ్య  జరగబోయే పోరు ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండు మ్యాచ్ లలో కూడా ఓటమి చవిచూసింది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడు మ్యాచ్లలో కూడా ఓటమి పాలు అయింది. ఇక ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు ఐపీఎల్లో బోనీ కొట్టలేదు అనే చెప్పాలి. దీంతో ఇక ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతూ ఉండడంతో ఏదో ఒక జట్టు బోని కొట్టడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.


 ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఇక ఈ రెండు జట్లు పోటీపడుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. రవీంద్ర జడేజా నాయకత్వంలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్... ఇక కేన్ విలియమ్సన్ సారథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మార్పులతో బరిలోకి దిగుతుంది అని తెలుస్తోంది


 మెగా వేలంలో 7.75 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసిన రొమారియో షేఫర్డ్ పై వేటు పడపోతుంది అని తెలుస్తుంది. రెండు మ్యాచ్ల్లో షేఫర్డ్ బౌలింగులో రాణించగా బ్యాటింగ్లో మాత్రం సత్తా లేక పోయాడు. దీంతో అతని బ్యాటింగ్ తిరు మేనేజ్మెంట్ ను నిరాశపరిచింది. ఇక దీంతో అతని స్థానంలో సౌత్ ఆఫ్రికా  ఆల్ రౌండర్ మార్కో జెన్నెస్  ను జట్టులోకి తీసుకోబోతున్నారట.  గత మ్యాచ్ లలో తీవ్రంగా నిరాశపరిచిన అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ లను కూడా కొనసాగిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్లో అదరగొట్టిన రవికుమార్ ను సమద్ లేదా అభిషేక్ శర్మ స్థానంలో తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వేగంగా బంతులు వేస్తున్న ఇమ్రాన్ మాలిక్  బౌలింగులో వైవిద్యం  మాత్రం  చూపించలేకపోతున్నారు. దీంతో అతన్ని స్థానంలో వేరొకరిని తీసుకుంటారా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: