విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీరిద్దరూ కూడా ప్రస్తుతం భారత క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్లుగా కొనసాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇద్దరు క్రికెటర్లు కూడా ఎవరికి వారే సాటి. ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించడంలో వీరికి సాటి ఎవరూ లేరు అనే చెప్పాలి. గతంలో విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్ గా ముందుకు నడిపిస్తే ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ చేపట్టిన రోహిత్ శర్మ జట్టును ముందుకు నడిపిస్తూ ఉన్నాడు.  ఈ అత్యుత్తమ క్రికెటర్లలో ఎవరు గొప్ప అంటే మాత్రం చెప్పడం అభిమానులందరికీ చాలా కష్టమే. ఇక ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఇద్దరూ వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.


 ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగుతూ ఉంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కీలక నేతగా కొనసాగుతున్నారు విరాట్ కోహ్లీ. ఇటీవలే ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరుగగా కోహ్లీ సేన రోహిత్ జట్టుపై ఘన విజయం సాధించింది. కోహ్లీ ఈ మ్యాచ్లో 48 పరుగులు చేసి రాణించాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర ప్రశ్న ఐపీఎల్ ఫాన్స్ ముందు ఉంచింది.  ఏ ఇండియన్ ప్లేయర్ స్టైలిష్స్ట్ స్ట్రోక్ ప్లేయర్ అని ప్రశ్న అడిగింది.. విరాట్ రోహిత్ శర్మ పేర్లను పేర్లను ఆప్షన్ లుగా పెట్టింది.


 ఈ క్రమంలోనే 72 శాతం మంది అభిమానులు విరాట్ కోహ్లీ ఇండియన్ స్టైలిష్ స్ట్రోక్ ప్లేయర్ గా పేర్కొన్నారు.  రోహిత్ శర్మ 28 శాతం మంది అభిమానులు మాత్రమే స్టైలిష్ స్ట్రోక్ ప్లేయర్ అంటూ భావించారు. రోహిత్ శర్మ అటు విరాట్ కోహ్లీ దరిదాపుల్లో కూడా నిలవ లేకపోవడం గమనార్హం. ఇక ఈ ఫలితం ప్రకటించక ముందు ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ రిజల్ట్ చూస్తే మాత్రం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చిత్తుచిత్తుగా ఓడించేశాడు. ఇక ఈ ఫలితం చూసిన కోహ్లీ అభిమానులు ఫుల్ హ్యాపీ అయ్యారు..

మరింత సమాచారం తెలుసుకోండి: