ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అనే విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే ఇక మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 200కు పైగా పరుగులు చేసింది. అయితే గతంలో కూడా ఇలా భారీ పరుగులు చేసినప్పటికీ చెన్నై జట్టు కాపాడుకోలేక పోయింది. మరి ఈసారి ఏం జరుగుతుందో అన్నది మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే మొదటి నుంచి అటు చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విభాగం కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి అటు వికెట్లు పడగొట్టడమే కాదు పరుగులను కూడా కట్టడి చేశారు.


 దీంతో ఇక మొదటినుంచీ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా మారిపోయింది అని చెప్పాలి. ఒకానొక దశలో అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు డూప్లేసెస్ విరాట్ కోహ్లీ లాంటి కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో ఇక జట్టు గెలుస్తుందనే లేదా అని అనుకుంటున్న సమయంలో కొంతమంది యువ ఆటగాళ్లు క్రీజులోకి వచ్చి మళ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడటంతో అందరిలో గెలుపు పై ఆశలు రేకెత్తాయి. ఇలా చివరకు ఏం జరుగుతుందో అని అనుకుంటున్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విభాగం విజృంభించడంతో ఇక వరుసగా వికెట్లు కోల్పోయింది బెంగళూరు జట్టు.


 దీంతో ఓటమి చవిచూసింది. అయితే చెన్నై జట్టుతో ఓటమిపై ఇటీవలే కెప్టెన్ డూప్లేసెస్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై తో మ్యాచ్ లో హర్షల్ పటేల్ లేకపోవడం ఆర్సిబి ని దెబ్బతీసింది. చివరి ఓవర్లలో బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. స్లో బాల్స్ తో బ్యాట్స్మెన్ లను బోల్తా కొట్టింఛే హర్షల్ పటేల్ లేకపోవడం విజయావకాశాలను దెబ్బ తీసింది అంటూ చెప్పుకొచ్చాడు డూ ప్లేస్సిస్. ఇక ఈ ఓటమితో అతని విలువ ఏంటో తెలిసి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా సోదరి  మరణం తో బయో బబుల్ నుంచి బయటకు వెళ్ళిన హర్షల్ పటేల్ మరికొన్ని రోజుల్లో జట్టుతో కలవబోతున్నాడూ అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl