ఐపీఎల్ సీజన్ 15 లో పాల్గొనే జట్లు తమ వద్ద ఉన్న ఆటగాళ్లను నలుగురిని మాత్రమే అంటి పెట్టుకుని మిగిలిన వారిని మెగా వేలానికి వదిలిన విషయం తెలిసిందే. ఈ వేలంలో అన్ని జట్లు తమకు నచ్చిన ఆటగాళ్లను కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. అదే విధంగా ముంబై ఇండియన్స్ హాంకాంగ్ కు చెందిన బ్యాటింగ్ ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్ ను 8.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన టీ 20 లలో ఇతని ప్రదర్శనను ఆధారంగా చేసుకుని డేవిడ్ పై అంత మొత్తం పెట్టింది ముంబై యాజమాన్యం. ఇతను చివర్లో హార్డ్ హిట్టింగ్ చేయగల సమర్థుడు మరియు ఆఫ్ స్పిన్ వేసి బ్యాట్స్మన్ లను బోల్తా కొట్టించగలడు.

అయితే ఇతనిని ముంబై ఇండియన్స్ సరిగా వాడుకుంటోందా? అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ ఐపిఎల్ లో ముంబై ఆడిన 5 మ్యాచ్ లలో కేవలం 2 మ్యాచ్ లలో మాత్రమే డేవిడ్ ను ఆడించింది. డేవిడ్ ను ముంబై యాజమాన్యం ఢిల్లీ మరియు రాజస్థాన్ తో మాత్రమే ఆడించింది. కేవలం రెండు మ్యాచ్ లలోనే అతని ప్రతిభ ఎలా బయటపడుతుంది? ఇంతటి ఐపిఎల్ అనుభవం ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ మరియు ముంబై కోచ్ లకు ఈ విషయం తెలియదా? ఎందుకు ఇతనిని ఆ తర్వాత మ్యాచ్ లలో కొనసాగించలేదు? అంతే కాకుండా ఒక్కో టీమ్ తుది జట్టులో 4 ఓవర్ సీస్ ప్లేయర్స్ ఉండవచ్చు. కానీ ముంబై మాత్రం జరిగిన చివరి రెండు మ్యాచ్ లలో 2 ప్లేయర్స్ ను మాత్రమే ఆడించింది.

అలాంటప్పుడు డేవిడ్ ను ఆడించి ప్రయోగం చేసిఉంటే ఫలితం ఉండేది. ఉదాహరణకు నిన్న ఆడిన మ్యాచ్ లో బసిల్  తంపి కి బదులుగా డేవిడ్ ను తీసుకుంటే బ్యాటింగ్ చేయగలడు మరియు ముంబై కి అవసరం అయిన అయిదవ బౌలర్ గా కూడా ఉపయోగపడుతాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైన్ అప్ చూస్తే రోహిత్, ఇషాన్, తిలక్, బ్రెవిస్, సూర్య మరియు పోలార్డ్ తర్వాత బ్యాటింగ్ ఆడగలిగే వారు లేరు. ఈ కారణంగానే రాత్రి మ్యాచ్ ఓడిపోయింది. ఒకవేళ డేవిడ్ గత మ్యాచ్ లో ఉంటే... ఆఖరిలో తన హిట్టింగ్ తో మ్యాచ్ ను గెలిపించేవాడు. ఇకనైనా ఇతనిని మ్యాచ్ లో రెగ్యులర్ ప్లేయర్ గా ఆడించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: