టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా గుర్తింపు సంపాదించుకున్న హార్థిక్ పాండ్య అటు ఐపీఎల్ లో కూడా సత్తా చాటాడు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో గత సీజన్  వరకు ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా  కొనసాగిన హార్థిక్ పాండ్య ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రమే కెప్టెన్గా మారిపోయాడు. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా ను మెగా వేలంలోకి వదిలేయడంతో కొత్తగా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ జట్టు అతని సొంతం చేసుకొని కెప్టెన్సీ కూడా అప్పగించింది.  ప్రస్తుతం కెప్టెన్గా ఆటగాడిగా కూడా అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు హార్దిక్ పాండ్యా.


 అయితే గతంలో భుజం గాయం బారిన పడి కోలుకున్న హార్దిక్ పాండ్యా ఎన్నో రోజుల పాటు బౌలింగ్ కు కూడా దూరం అయ్యాడు అనే విషయం తెలిసిందే. దీంతో హార్దిక్ పాండ్యా పేలవమైన ఫామ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే హార్దిక్ పాండ్యా ఇక జట్టులో కెప్టెన్గా సమర్థవంతంగా నడిపిస్తున్నాడు అని అభిమానులు అనుకుంటున్న సమయంలో ఇటీవలే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా 18 ఓవర్లు వేసిన హార్దిక్  కేవలం మూడు బంతులు మాత్రమే వేసి ఫీల్డ్ ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.


 ఇక ఈ ఓవర్లో రెండో బంతికే జెమిసన్ వికెట్ వికెట్ పడగొట్టి మ్యాచ్ ను గుజరాత్ వైపు తిప్పిన హార్దిక్ పాండ్యా గజ్జ గాయం కారణంగా ఫీల్డ్  విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక మిగతా ఓవర్ మొత్తం విజయ్ శంకర్ పూర్తి చేశాడు అని చెప్పాలి. హార్దిక్ పాండ్యా గాయం తీవ్రతరం అవుతుందని అందరూ ఆందోళన చెందారు. హార్థిక్  గాయం తీవ్రతమైనది కాదు అన్నది సమాచారం.  తర్వాత గుజరాత్  ఆడబోయే మ్యాచ్ లో హార్దిక్  అందుబాటులో ఉంటాడని జట్టు యాజమాన్యం చెప్పినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: