నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంతా ఎప్పుడూ వార్తల్లో నానుతూనే ఉంది. సమంత చేస్తున్న సినిమాల అప్డేట్లు.. సమంత ఒప్పుకుంటున్న సినిమాలు.. ఇలా సోషల్ మీడియాలో సమంత గురించి చర్చ జరుగుతూనే ఉంది. అంతే కాదు ఫిట్నెస్ విషయంలో సమంత చూపిస్తున్న డెడికేషన్ కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం దాటిపోయిననప్పటికీ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పుడూ అభిమానులకు అప్డేట్లను పోస్ట్ చేస్తూనే ఉంది. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటించడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.


 ఈ క్రమంలోనే ఇటీవల తన అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి అభిమానులతో చిట్ చాట్ చేసింది అభిమానులు. అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చింది ఈ సొగసరి. ఈ క్రమంలోనే మీరు మీ జీవితంలో థియేటర్ లో చూసిన మొదటి సినిమా ఏది అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా.. జురాసిక్ పార్క్ అంటూ సమాధానం చెప్పింది సమంత. ఇక మొదటి సంపాదన ప్రస్తావనను ఒక అభిమాని తీసుకురాగా.. ఒక హోటల్లో హోస్టెస్ గా ఎనిమిది గంటలపాటు పని చేసి మొదటిసారి 500 రూపాయలు సంపాదించాను అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇక మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని మీ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయండి అంటూ ఒక మెసేజ్ కూడా అభిమానులకు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.


 ఎప్పటికైనా వేసుకోవాలి అని మీరు అనుకుంటున్న టాటూ ఏంటి అని ఒక అభిమాని ప్రశ్నించగా తాను అసలు ఎలాంటి టాటూలు వేయించుకోవద్దని  నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.  అంతేకాదు తాను టాటూ వేయించుకుంటాను అనే ఆలోచన మీకు ఎవరికైనా ఉంటే అలాంటివి మానుకోవాలని అంటు సలహా ఇచ్చింది. ఇక సమంత టాటూల గురించి చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారిపోయాయ్. అయితే గతంలో మాజీ భర్త పై ప్రేమతో 3 టాటూలు వేయించుకుంది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: