ఈ క్రమంలోనే ఇటీవల సోదరి దూరం కావడం పై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన సోదరి అర్చితా పటేల్ తో ఉన్న ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అక్క నువ్వు మా జీవితాల్లో గొప్ప వ్యక్తివి.. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతోనే ఎదుర్కొన్నావ్.. నేను నీతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆట మీద దృష్టి పెట్టాలని నీ గురించి ఆలోచించవద్దు అంటూ చెప్పావ్. ఆ మాటల వల్ల నేను ఇప్పుడు మళ్లీ జట్టుతో కలిసి ఢిల్లీతో మ్యాచ్లో బరిలోకి దిగాను. నీ కోసం మాత్రమే ఇది చేయగలిగాను.
నువ్వు నా గురించి గర్వపడేలా చేసినవన్నీ కూడా ఎప్పటికీ అలాగే కొనసాగిస్తాను.. ఇక నా జీవితంలోని ప్రతి క్షణం కూడా నేను నిన్ను మిస్ అవుతూ నే ఉంటాను అక్క.. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అంటూ ఒక భావోద్వేగ పూరితమైన పోస్టు పెట్టాడు హర్షల్ పటేల్. అయితే బయో బబుల్ నుంచి బయటకు వెళ్లిన హర్షల్ పటేల్ ఇక ఇటీవలే మళ్లీ జట్టు లో చేరాడు. ఇక ఎంతో ఇష్టమైన అక్క దూరమైంది అన్న కొండంత బాధను మనసులో దాచుకుని ఇటీవల ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో తలపడ్డాడు హర్షల్ పటేల్. ఇక హర్షల్ పటేల్ మళ్లీ జట్టులోకి రావడం తో ఆర్సిబి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి