కొన్ని కొన్ని సార్లు అసలు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇటీవల లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా కోహ్లీ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరగడంతో కోహ్లీ అభిమానులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో సారి తన ఆఫ్ స్టంప్ బలహీనతను బయటపెట్టి వికెట్ సమర్పించుకున్నాడు విరాట్ కోహ్లీ. 7 మ్యాచ్ లలో కేవలం కోహ్లీ చేసింది 119 పరుగులు మాత్రమే. ఒక టాప్ క్లాస్ బ్యాట్ మెన్ అయిన కోహ్లీ ఇలాంటి ప్రదర్శన చేయడం మాత్రం అభిమానులను నిరాశ లో ముంచెత్తుతోంది. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఎదుర్కొంటున్న పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా ఒక పోస్టు ద్వారా చూపించాడు.
వసీం జాఫర్ పెట్టిన ట్విట్టర్ పోస్టులో నాలుగు ఫోటోలు నాలుగు సందర్భాలు ఉన్నాయి. తొలి ఫోటోలో హాయిగా పడుకుని నిద్ర పోదాం అనుకుంటే కళ్ళకే వెలుతురు కొట్టడం కనిపిస్తోంది. ఇక రెండు ఫోటోలు ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేద్దామంటే డబ్బు మిషన్లో ఇరుక్కొని చిరిగిన నోటు బయటకు వస్తుంది. ఇక మూడో ఫోటోలో ఊరించే కేక్ ముందున్న తినలేని పరిస్థితి. నాలుగొ ఫోటోలో కోక్ తాగుదాం అంటే దాన్ని ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాక పోవడం చూడవచ్చు. అంటే దీని అర్థం కోహ్లీ మంచిగా ఆడదాం అనుకుంటే ఏదో ఒక రూపంలో దురదృష్టం వెంటాడుతోంది. లేదంటే నిర్లక్ష్యంగా క్రికెట్ పారేసుకోవడం జరుగుతుందని అర్థం వచ్చే విధంగా పోస్టు పెట్టాడు వసీం జాఫర్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి